తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'సాగు చట్టాల' కమిటీపై అనుమానాలు- సుప్రీం అసహనం - supreme court news

Supreme Court asks Centre to withdraw its plea against proposed tractor rally by farmers on Republic Day.
'ట్రాక్టర్​ ర్యాలీపై వేసిన వ్యాజ్యాన్ని వెనక్కి తీసుకోండి'

By

Published : Jan 20, 2021, 1:06 PM IST

Updated : Jan 20, 2021, 3:40 PM IST

12:48 January 20

ట్రాక్టర్​ ర్యాలీ పిటిషన్​ను ఉపసంహరించుకున్న కేంద్రం

నూతన సాగు చట్టాలపై నెలకొన్న ప్రతిష్టంభనను తొలగించేందుకు ఏర్పాటు చేసిన కమిటీపై కొన్ని రైతు సంఘాలు అనుమానం వ్యక్తం చేయటం పట్ల అసహనం వ్యక్తం చేసింది సుప్రీం కోర్టు. ప్యానల్​కు ఎలాంటి నిర్ణయాధికారం ఇవ్వలేదని, వారు ఇరు పక్షాల అభిప్రాయాలు మాత్రమే తెలుసుకుంటారని స్పష్టం చేసింది.  

రైతుల ఆందోళనలు, ఈనెల 26న ట్రాక్టర్​ ర్యాలీపై దాఖలైన పిటిషన్లపై విచారణ సందర్భంగా.. కీలక వ్యాఖ్యలు చేసింది ప్రధాన న్యాయమూర్తి జస్టిస్​ ఎస్​ ఏ బోబ్డే నేతృత్వంలోని ధర్మాసనం. ఈ అంశంలో జడ్జీలు నిపుణులు కానందువల్లే.. సంబంధిత నిపుణులతో కమిటీ ఏర్పాటు చేసినట్లు పేర్కొంది.  

" ఇందులో పక్షపాతం అనే ప్రశ్న ఎక్కడుంది? కమిటీకి మేము నిర్ణయాధికారులు ఇవ్వలేదు. కేవలం వారు ఇరు పక్షాల అభిప్రాయాలు మాత్రమే వింటారు. మీరు కమిటీ ముందుకు రావద్దనుకోవటాన్ని అర్థం చేసుకోగలం, కానీ అభిప్రాయాలు చెప్పారని ఒకరిపై అనుమానాలు వ్యక్తం చేయటం సరికాదు. ఎవరిపై ఇలాంటివి చేయాల్సిన అవసరం లేదు. ప్రతి ఒక్కరికి ఒక అభిప్రాయం ఉంటుంది. న్యాయమూర్తులకు కూడా వ్యక్తిగత అభిప్రాయాలు ఉంటాయి. ఇష్టంలేని వ్యక్తులపై నిందలు వేయటం ఒక ప్రమాణంగా మారింది. అది సరైనది కాదు."

      - సుప్రీం ధర్మాసనం

కమిటీ పునర్నియామకంపై నోటీసులు

సాగు చట్టాలపై సుప్రీం కోర్టు నియమించిన కమిటీ నుంచి ఒకరు తప్పుకున్న క్రమంలో కమిటీని పునర్నియమించాలని కోరుతూ.. కిసాన్​ మహా పంచాయత్​ పిటిషన్​ దాఖలు చేశారు. ఈ పిటిషన్​పై విచారించిన న్యాయస్థానం..  కేంద్రానికి నోటీసులు ఇచ్చింది.  

ట్రాక్టర్​ ర్యాలీపై కేంద్రం వెనక్కి..

గణతంత్ర దినోత్సవం రోజున రైతుల ట్రాక్టర్​ ర్యాలీపై కేంద్రం వెనక్కి తగ్గింది. ర్యాలీకి వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్​ను ఉపసంహరించుకుంది. ఈ పిటిషన్​పై విచారణ జరిపిన న్యాయస్థానం.. అది పూర్తిగా పోలీసులకు సంబంధించిన విషయమని పేర్కొంది. ఈ క్రమంలో ట్రాక్టర్​ ర్యాలీపై నిర్ణయాన్ని దిల్లీ పోలీసులకే వదిలేస్తున్నట్లు పేర్కొంటూ పిటిషన్​ను వెనక్కి తీసుకుంది.

కమిటీపై అనుమానాలతో వివాదం..

కొత్త సాగు చట్టాల అమలుపై గతవారం స్టే విధించిన సర్వోన్నత న్యాయస్థానం.. సమస్య పరిష్కారం కోసం నలుగురు సభ్యులతో ప్యానెల్‌ను ఏర్పాటు చేసింది. ఈ కమిటీలో భూపీందర్‌సింగ్‌ మాన్‌, ప్రమోద్‌ కుమార్‌, అశోక్‌ గులాటి, అనిల్‌ ఘన్వత్‌ ఉన్నారు. అయితే ఈ కమిటీని కొందరు రైతు సంఘాల ప్రతినిధులు తిరస్కరించారు. వీరంతా ప్రభుత్వానికి అనుకూల వ్యక్తులని, సాగు చట్టాలను సమర్థిస్తూ గతంలో వ్యాసాలు కూడా రాశారని ఆరోపించారు. అలాంటి కమిటీ ముందు తాము హజరయ్యే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. ఇది కాస్తా వివాదాస్పదంగా మారడంతో సభ్యుల్లో ఒకరైన మాన్‌ కమిటీ నుంచి తప్పుకున్నారు.

Last Updated : Jan 20, 2021, 3:40 PM IST

ABOUT THE AUTHOR

...view details