తెలంగాణ

telangana

ETV Bharat / bharat

అయోధ్య పరిధిలో మసీదు నిర్మించొద్దు: వీహెచ్​పీ - అయోధ్య మసీదు నిర్మాణం వార్తలు

అయోధ్యలో పురపాలక పరిధి దాటిన తర్వాతే సున్నీ వక్ఫ్​ బోర్డుకు మసీదు నిర్మాణానికి ఐదెకరాల స్థలం కేటాయించాలని విశ్వ హిందూ పరిషత్​ డిమాండ్​ చేసింది. రామ మందిర నిర్మాణ ట్రస్టు బాధ్యతలను ఆర్​ఎస్​ఎస్​ అధినేత మోహన్ భగవత్​కు అప్పగించొద్దని కోరింది.

VHP
అయోధ్య పరిధిలో మసీదు నిర్మించొద్దు: వీహెచ్​పీ

By

Published : Dec 8, 2019, 6:34 AM IST

అయోధ్యలో మసీదు నిర్మాణంపై విశ్వ హిందూ పరిషత్ (వీహెచ్​పీ)​ కొత్త డిమాండ్​ను తెరపైకి తెచ్చింది. అయోధ్య పురపాలక పరిధి దాటిన తర్వాతే మసీదు నిర్మాణం కోసం సున్నీ వక్ఫ్ బోర్డుకు స్థలం కేటాయించాలని డిమాండ్ చేసింది.

రామ మందిర నిర్మాణ ట్రస్టులో ఆర్ఎస్​ఎస్​ అధినేత మోహన్​ భగవత్​కు నేతృత్వ బాధ్యతలు అప్పగించొద్దని వీహెచ్​పీ ఉపాధ్యక్షుడు చంపత్​రాయ్ కోరారు.

పాత ఆయోధ్యలో..
2018 డిసెంబర్​ వరకు అయోధ్య చిన్న పురపాలక పట్టణం. ఆ తర్వాత ఆయోధ్య-ఫైజాబాద్​ పురపాలక పట్టణాలు కలిసిపోయాయి. అయితే మసీదు నిర్మాణానికి పాత అయోధ్య పరిధి బయట ఐదెకరాల భూమి కేటాయించాలని చంపత్​రాయ్​ పేర్కొన్నారు.

వచ్చే ఏడాది ట్రస్టు..

రామ మందిర నిర్మాణ ట్రస్ట్​కు మోహన్ భగవత్​ నేతృత్వం వహించనున్నారనే అంశంపై స్పందిస్తూ.. 'అది ఎన్నటికీ జరగదు' అని చెప్పారు చంపత్​రాయ్​. 2020 జనవరిలో రామ మందిర నిర్మాణ ట్రస్టు​ ఏర్పాటు కావచ్చని తెలిపారు.

ఏళ్ల తరబడి సాగిన అయోధ్య భూవివాదం కేసులో నవంబర్​ 9న సుప్రీం కోర్టు ఏకగ్రీవ తీర్పును వెలువరించింది. వివాదాస్పద భూమిని రామ మందిర నిర్మాణానికి కేటాయించింది. అయితే అయోధ్యలోనే మసీదు నిర్మాణం కోసం ఐదు ఎకరాల భూమిని సున్నీ వక్ఫ్ బోర్డుకు కేటాయించాలని అత్యున్నత న్యాయస్థానం సూచించింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో ఎవరైనా ఈ భూమిని ఇవ్వాలని ఆదేశించింది.

రివ్యూ వారి హక్కు..

అయోధ్య భూవివాదం కేసులో సుప్రీం తీర్పుపై దాఖలైన రివ్యూ పిటిషన్​లపైనా చంపత్​రాయ్​ స్పందించారు. 'అది వారి హక్కు' అని పేర్కొన్నారు. దాని ప్రభావం తమపై పెద్దగా ఉండదని తెలిపారు.

ఇదీ చూడండి:'ఉత్తర్​ప్రదేశ్​లో నేరస్థులకు చట్టమంటే భయమే లేదు'

ABOUT THE AUTHOR

...view details