పంజాబ్‌లో రైతుల ఆందోళన.. రైల్వే శాఖకు తీరని నష్టాన్ని మిగిల్చింది. కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా సెప్టెంబర్ 24 నుంచి జరుగుతున్న నిరసనలతో తమకు రూ. 2,220 కోట్ల నష్టం వాటిల్లినట్లు భారతీయ రైల్వే తెలిపింది.
'అక్కడి రైతుల ధర్నాతో వేల కోట్లు నష్టం'
కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా పంజాబ్‌లో రైతుల ఆందోళన వల్ల.. రూ. 2220 కోట్లు నష్టపోయినట్లు వెల్లడించింది భారతీయ రైల్వే. దిగ్బంధాల కారణంగా రవాణా కార్యకలాపాలకు తీవ్ర ఆటంకం కలిగినట్లు తెలిపింది.
'అక్కడి రైతుల ధర్నాతో వేల కోట్లు నష్టపోయాం'
రైతుల ఆందోళనలతో.. 3,850 సరకు రవాణా రైళ్లు రద్దయినట్లు రైల్వే శాఖ పేర్కొంది. మరో 2,352 ప్యాసింజర్ రైళ్లు రద్దయ్యాయని, మరికొన్నింటిని దారి మళ్లించాల్సి వచ్చిందని ఒక ప్రకటనలో తెలిపింది.
ఇదీ చూడండి:సాగు చట్టాల గురించి సగం మంది రైతులకు తెలీదు!