ఉగ్రదాడి మృతులకు 'సైకత' నివాళి - పూరీ
న్యూజిలాండ్‌లో జరిగిన ఉగ్రదాడి అంతర్జాతీయ సమాజాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. ప్రపంచ దేశాలు న్యూజిలాండ్‌కు సంఘీభావం తెలుపుతున్నాయి. మృతుల కుటుంబాలకు సంతాపం తెలుపుతూ క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నాయి. సముద్ర తీరంలో ఇసుకతో సృజనాత్మక కళాఖండాలు రూపొందించే సుదర్శన్ పట్నాయక్ తన సైకత శిల్పంతో కాల్పుల్లో మృతి చెందిన వారికి ఘన నివాళులర్పించారు. ఒకే ప్రపంచం-ఒకే సందేశం(వన్ వరల్డ్-వన్ మెస్సేజ్) అనే శీర్షికతో ఉగ్రవాదాన్ని నిర్మూలించాలంటూ ఒడిశాలోని పూరీ తీరాన సైకత శిల్పం రూపొందించారు.
సైకత శిల్పం
.