తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'సీఏఏ అమలుతో అక్రమ వలసదారుల్లో భయం'

పౌరసత్వ చట్టం అమలు చేసేందుకు కేంద్రం కసరత్తు ప్రారంభించిన నేపథ్యంలో స్వదేశానికి తిరిగి వెళ్లే బంగ్లాదేశ్​ అక్రమ వలసదారులు సంఖ్య పెరిగిందని బీఎస్ఎఫ్​ తెలిపింది. జనవరిలో పట్టుబడిన 268 మందిలో అధికంగా తిరిగి వెళ్లే ప్రయత్నాల్లో ఉన్నవారేనని వెల్లడించింది.

BSF
'సీఏఏ అమలుతో స్వదేశానికి బంగ్లాదేశ్​ అక్రమ వలసదారులు'

By

Published : Jan 24, 2020, 6:55 PM IST

Updated : Feb 18, 2020, 6:41 AM IST

పౌరసత్వ సవరణ చట్టం అమలుపై కసరత్తు ఆరంభమైన తర్వాత స్వదేశానికి తిరిగి వెళ్లే బంగ్లాదేశ్‌ అక్రమ వలసదారుల సంఖ్య పెరిగిందని సరిహద్దు భద్రతా దళం (బీఎస్​ఎఫ్​) తెలిపింది.

జనవరి నెలలో తాము 268 మంది బంగ్లాదేశ్‌ అక్రమ వలసదారులను నిర్బంధించగా.. వీరిలో ఎక్కువ మంది స్వదేశానికి తిరిగి వెళ్లే ప్రయత్నాల్లో ఉన్న వారే అని వెల్లడించింది. పౌరసత్వ సవరణ చట్టంపై నిర్ణయం తీసుకున్న తర్వాత అక్రమ వలసదారుల్లో భయం ఏర్పడిందని పేర్కొంది.

పౌరసత్వ సవరణ చట్టాన్ని గత ఏడాది డిసెంబర్​ 11న పార్లమెంటు ఆమోదించగా.. దాన్ని అమల్లోకి తెస్తూ కేంద్ర హోంశాఖ ఇటీవలే గెజిట్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసింది.

ఇదీ చూడండి: భారత్​లో కరోనా..! చైనా నుంచి వచ్చిన ఇద్దరికి పరీక్షలు

Last Updated : Feb 18, 2020, 6:41 AM IST

ABOUT THE AUTHOR

...view details