ఉదయం వేళల్లో ప్రభుత్వ కార్యాలయాలు, రైల్వే, బస్ స్టేషన్ల వద్ద రోడ్ల పక్కన వాహనాలపై అల్పాహారం తింటూ చాలా మంది కనిపిస్తుంటారు. ఉరుకుల పరుగుల జీవితంలో వాటి తయారీకి వినియోగించే పదార్థాలు, నీటి శుభ్రతపై పట్టించుకనే పరిస్థితులు లేవు. ఇదే అదనుగా కొందరు ప్రజల ఆరోగ్యంతో చలగాటం ఆడుతున్నారు.
ముంబయి బోరివెలీలోని పశ్చిమ రైల్వే స్టేషన్ వద్ద ఇడ్లీల తయారీకి టాయిలెట్ నీటిని వినియోగిస్తున్న దృశ్యాలు ఆలస్యంగా వెలుగు చూశాయి.