తెలంగాణ

telangana

ETV Bharat / bharat

రెండో పెళ్లి వద్దన్నారని 75ఏళ్ల వరుడి ఆత్మహత్య - వివాహం

కుటుంబసభ్యులు రెండో పెళ్లికి నిరాకరించారని 75 ఏళ్ల వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఉత్తర్​ప్రదేశ్​లోని బరేలీలో జరిగింది. భార్య మరణంతో ఒంటరైన అర్షద్ రెండో పెళ్లికి సిద్ధమయ్యాడు. కుటుంబం పరువు పోతుందని... పిల్లలు వివాహానికి నిరాకరించడం వల్ల మనస్తాపం చెంది ఉరివేసుకున్నాడు.

రెండో పెళ్లి వద్దన్నారని 75ఏళ్ల వరుడి ఆత్మహత్య

By

Published : Aug 17, 2019, 6:04 PM IST

Updated : Sep 27, 2019, 7:43 AM IST

ఉత్తరప్రదేశ్​ బరేలీలో రెండో పెళ్లికి కుటుంబసభ్యులు నిరాకరించారన్న కారణంతో ఓ 75 ఏళ్ల వృద్ధుడు ఆత్మహత్య చేసుకున్నాడు. తమ తల్లి మరణంతో తండ్రి మరో వివాహానికి సిద్ధమయ్యాడని తెలుసుకున్న పిల్లలు కుటుంబం పరువు పోతుందని, వద్దని వారించారు.

కుటుంబ సభ్యుల మాట వినని అర్షద్ గురువారం రాత్రి వారితో వాదనకు దిగాడు. మనస్తాపం చెంది అర్ధరాత్రి సమయంలో ఉరివేసుకున్నట్లు సమాచారం.

"శుక్రవారం ఉదయం లేచేసరికి ఫ్యాన్​కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుని కనిపించాడని కుటుంబ సభ్యులు చెబుతున్నారు."

-పోలీసు అధికారి

మృతుడికి ఐదుగురు కుమారులు. ముగ్గురు కుమార్తెలు... అందరికీ పెళ్లిళ్లయ్యాయి. ముగ్గురు కుమారులు అర్షద్​తో పాటే నివసిస్తున్నారు.

ఇదీ చూడండి: జైట్లీ ఆరోగ్యం మరింత విషమం- ఆస్పత్రికి నేతలు

Last Updated : Sep 27, 2019, 7:43 AM IST

ABOUT THE AUTHOR

...view details