ఉద్యోగ కల్పనకు సంబంధించి ఎన్ఎస్ఎస్ఓ నివేదికనను ప్రభుత్వం దాచిపెట్టిందని వస్తున్న ఆరోపణలపై ప్రభుత్వం స్పందించింది. నివేదిక ఇంకా పూర్తిగా సిద్ధం కాలేదనే, బహిర్గతం చేయలేదని మోదీ సర్కారు స్పష్టం చేసింది.
2017-18 ఎన్ఎస్ఎస్ అంచనాల ప్రకారం దేశంలో నిరుద్యోగం 45 ఏళ్ల గరిష్టానికి చేరిందని జాతీయ మీడియాలో కథనాలు వచ్చాయి. వీటిని ఆధారంగా చేసుకుని కాంగ్రెస్ సహా ప్రతిపక్ష పార్టీలు భాజపా సర్కారు పై విమర్శల వర్షం కురిపిస్తున్నాయి. ఎన్ఎస్ఎస్ఓ లెక్కల ప్రకారం 2011-12 నాటికి నిరుద్యోగ రేటు 2.2 శాతంగా ఉందని జాతీయ మీడియా కథనాలు వెలువరించింది.
భాజపా అధికారం చేపట్టినప్పుడు రెండు కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చిందని, కానీ ఎన్ఎస్ఎస్ఓ లెక్కలు చూస్తే పరిస్థితి దారుణంగా ఉందని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ వ్యాఖ్యానించారు.
ఈ అంశంపై నీతి ఆయోగ్ ఉపాధ్యక్షుడు రాజీవ్ స్పందించారు.