తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'పౌర' సవరణపై 'ప్రాంతీయ' విధానమేంటి! - పౌర చట్టంపై రాజకీయ పార్టీల తలోమాట

పౌరసత్వ సవరణ చట్టంపై ఆయా రాష్ట్రాలు, ప్రాంతీయ పార్టీలు భిన్న విధానాన్ని అవలంబిస్తున్నాయి. ప్రాంతీయ పార్టీలు పార్లమెంట్ ఓటింగ్ సమయంలోనే తమ వైఖరులను బయటపెట్టాయి. ఈ నేపథ్యంలో పౌరసత్వ చట్టంపై ఆయా పార్టీల విధానంపై సమగ్ర కథనం.

citizen
పౌర చట్టంపై రాజకీయ పార్టీల తలోమాట

By

Published : Dec 16, 2019, 9:43 PM IST

వివాదాస్పద పౌరసత్వ సవరణ చట్టంపై దేశ రాజధాని దిల్లీ, బంగాల్, ఈశాన్య రాష్ట్రాలు సహా అనేక ప్రాంతాల్లో నిరసనలు కొనసాగుతూనే ఉన్నాయి. పొరుగుదేశం వారికి భారత్​లో పౌరసత్వం కల్పించే ఈ చట్టంపై ఇప్పటికే పలు రాష్ట్రాలు, రాజకీయ పార్టీలు తమ విధానాన్ని స్పష్టం చేశాయి. ఈ నేపథ్యంలో పార్టీల వైఖరి..

ఈశాన్యాన పార్టీల తలోదారి...

పౌరసత్వ చట్టంపై ఈశాన్య రాష్ట్ర ప్రాంతీయ పార్టీలు, అధికార ప్రభుత్వాల్లో తలో మాట వినిపిస్తోంది. అసోంలో భాజపా మిత్రపక్షం.. అసోం గణ పరిషత్​ ఇప్పటికే ఈ చట్టానికి వ్యతిరేకంగా తమ గళం వినిపించింది. సుప్రీం కోర్టుకు వెళ్లేందుకు సిద్ధమైంది. అయితే.. ఆ పార్టీ ఇంకా భాజపాకు సన్నిహితంగానే ఉందని వార్తలు వినిపిస్తున్నాయి.

అసోం: ఏఐడీయూఎఫ్​ పౌరచట్టాన్ని సంపూర్ణంగా వ్యతిరేకిస్తోంది. ఈ పార్టీ నుంచి ధుబ్రి లోక్​సభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు.

మేఘాలయ: ఇక్కడ ఎన్​పీపీ భాజపాకు మిత్రపక్షమే. అయినప్పటికీ ముఖ్యమంత్రి కాన్రాడ్​ సంగ్మా చట్టంలోని కొన్ని రిజర్వేషన్ల అంశమై ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విషయమై ఆయన అమిత్​ షాను కలిస్తే... రాష్ట్ర ప్రజల ప్రయోజనాలకు ఎలాంటి హానీ ఉండదని భరోసా కల్పించారు కేంద్ర హోం మంత్రి.

సిక్కిం: ఈ రాష్ట్రంలో సిక్కిం క్రాంతికారి మోర్చా.. భాజపా నేతృత్వంలోని ఈశాన్య ప్రజాస్వామ్య కూటమి పార్టీనే. అయితే.. పార్లమెంటులో పౌరచట్టానికి వ్యతిరేకంగా ఓటు వేసినప్పటికీ.. సిక్కిం అధికరణ 371(ఎఫ్​) కింద ఉంది కాబట్టి.. కేంద్ర చట్టాన్ని తప్పనిసరిగా అమలు చేయాల్సిన పరిస్థితి నెలకొంది.

త్రిపుర: ఇక్కడ భాజపా మిత్రపక్షం ఐపీఎఫ్​టీ కూడా చట్టానికి వ్యతిరేకమే.

మిజోరం: రాష్ట్రంలో భాజపా మిత్ర పక్షం- మిజో నేషనల్​ ఫ్రంట్​ క్యాబ్​కు అనుకూలమే. అయితే.. కొత్త చట్టం నుంచి రాష్ట్రానికి మినహాయింపు కల్పించారు.

మణిపుర్​:ఇక్కడ పెద్దగా ప్రాంతీయ పార్టీలేమీ లేవు. రాష్ట్రంలోని కాంగ్రెస్​, వామపక్షాలు పౌర చట్టాన్ని వ్యతిరేకిస్తున్నాయి.

అరుణాచల్​ ప్రదేశ్​: ఇక్కడ అధికారంలో ఉంది భాజపానే. కొన్ని విద్యార్థి సంఘాలు, ఈశాన్య విద్యార్థి సమాఖ్యల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది.

నాగాలాండ్​: అధికార ఎన్డీపీపీ భాజపాకు మిత్రపక్షం. కొత్త పౌరచట్టానికి అనుకూలమే.

బంగాల్​:ఇక్కడ మమతా బెనర్జీ నేతృత్వంలోని అధికార తృణమూల్​ కాంగ్రెస్​.. పౌరచట్టానికి పూర్తి వ్యతిరేకం. కేంద్ర నిర్ణయానికి వ్యతిరేకంగా రాష్ట్రంలో ఆందోళనలు హింసాత్మకంగా మారాయి. రాష్ట్ర ముఖ్యమంత్రే స్వయంగా నిరసనలను ముందుండి నడిపిస్తున్నారు.

బిహార్​:బిహార్​లోని అధికార జేడీయూ క్యాబ్​కు మద్దతిస్తున్నప్పటికీ.. కేంద్రం దేశవ్యాప్తంగా తీసుకురావాలనుకుంటున్న ఎన్​ఆర్​సీని వ్యతిరేకిస్తోంది.

ఒడిశా: భాజపాకు మిత్ర పక్షం కానప్పటికీ ఇక్కడ అధికారంలోని బిజూ జనతాదళ్​.. చట్టానికి మద్దతిస్తోంది.

ఝార్ఖండ్​:ప్రతిపక్షంలో ఉన్న ఝార్ఖండ్​ ముక్తి మోర్చా.. క్యాబ్​ను పూర్తిగా వ్యతిరేకిస్తోంది.

ఆంధ్రప్రదేశ్:అధికార వైఎస్​ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తుండగా, ప్రతిపక్ష తెలుగుదేశం అనుకూలంగా ఓటేసింది.

తెలంగాణ:అధికార తెలంగాణ రాష్ట్ర సమితి.. చట్టానికి పూర్తిగా వ్యతిరేకం.

తమిళనాడు:రాష్ట్రంలో అధికారంలో ఉన్న ఏఐఏడీఎంకే పౌరసత్వ సవరణకు అనుకూలం. శ్రీలంకలో ఉన్న తమిళులకు ఈ చట్టం లాభిస్తోందన్న కారణంతో ఈ విధానానికి మొగ్గుచూపింది. అయితే యూపీఏ కూటమి పార్టీ డీఎంకే పౌరసత్వ చట్టానికి వ్యతిరేకం.

కర్ణాటక: మాజీ ప్రధాని దేవెగౌడ పార్టీ జేడీయూ చట్టానికి వ్యతిరేకం. లౌకకివాదానికి విఘాతం అన్న కారణంతో ప్రతికూలంగా ఉంది.

ఇదీ చూడండి: 'పౌరచట్టంపై కాంగ్రెస్ సభ్యులందరిదీ పోరాట పంథానే'

ABOUT THE AUTHOR

...view details