తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'భారత్​లో ప్రాణాలు తీస్తున్న వాయుకాలుష్యం' - నివేదిక

భారత్​లో 2017 సంవత్సరం సంభవించిన మరణాల్లో 12 లక్షలమంది వాయుకాలుష్యం కారణంగానే కన్నుమూశారని పేర్కొంది అమెరికాకు చెందిన హెల్త్​ ఎఫెక్ట్స్ ఇన్స్​టిట్యూట్​ అనే సంస్థ. మొత్తంగా 2017లో కాలుష్యం వల్ల 50 లక్షల మంది అకాలమరణం చెందారని వెల్లడించింది. స్టేట్​ గ్లోబల్ ఎయిర్-2019 పేరిట విడుదల చేసిన నివేదికలో భారత్​కు సంబంధించిన పై అంశాలను ఉటంకించింది.

భారత్​లో ప్రాణాలు తీస్తున్న వాయుకాలుష్యం: నివేదిక

By

Published : Apr 3, 2019, 5:15 PM IST

భారత్​లో ప్రాణాలు తీస్తున్న వాయుకాలుష్యం: నివేదిక
భారత్​లో పర్యావరణ కాలుష్యం కారణంగా గత 2017లో 12లక్షలమంది అకాల మరణం చెందినట్లు అమెరికాకు చెందిన హెల్త్​ ఎఫెక్ట్స్ ఇన్స్​టిట్యూట్​ పేర్కొంది. స్టేట్ గ్లోబల్ ఎయిర్-2019 అనే నివేదికలో పై అంశాలను ఉటంకించింది.

భారత్, చైనాల్లో అధికం

2017లో ప్రపంచ వ్యాప్తంగా 50 లక్షల మరణాలు.. గుండెపోటు, డయాబెటిస్, ఊపిరితిత్తుల కాన్సర్, దీర్ఘకాల ఊపిరితిత్తుల సంబంధిత జబ్బులతో సంభవించినట్లు వెల్లడించింది. 30 లక్షల మరణాలు వాయుకాలుష్యం వల్ల సంభవించగా.. అందులో సుమారు సగం వరకు భారత్​, చైనాల్లోనే జరిగాయని స్పష్టం చేసింది. 2017లో ఇరుదేశాల్లో 12లక్షల చొప్పున మృతి చెందినట్లు పేర్కొందీ నివేదిక.

మూడో కారణం ఇదే...

భారత్​లో సంభవిస్తున్న మరణాలకు గల కారణాల్లో పర్యావరణ కాలుష్యం మూడోస్థానంలో నిలుస్తోందని తెలిపింది గ్లోబల్ ఎయిర్ నివేదిక.

తగ్గుతున్న వయోపరిమితి...

దక్షిణాసియాలో జన్మిస్త్తున్న శిశువుల వయో పరిమితి పర్యావరణ కాలుష్యం కారణంగా రెండున్నరేళ్ల పాటు కుచించుకు పోతున్నట్లు స్పష్టం చేసింది. ప్రపంచ వ్యాప్తంగా ఇది 20నెలలుగా ఉన్నట్లు వెల్లడించింది.

ప్రభుత్వ పథకాలతో తగ్గుముఖం పట్టే అవకాశం

ప్రధానమంత్రి ఉజ్వల్ యోజన, గృహావసరాలకు ఎల్​పీజీ గ్యాస్, భారత్ స్టేజ్6 వాహనాల వాడకం, జాతీయ వాయు శుభ్రత పథకం ద్వారా కాలుష్యం తగ్గుముఖం పట్టే అవకాశం ఉన్నట్లు అభిప్రాయపడింది.

పోషకాహకార లోపం, మద్యం, శారీరక శ్రమ లేకపోవడం కంటే వాయుకాలుష్యం కారణంగా మృతి చెందే వారి సంఖ్య ఎక్కువగా ఉన్నట్లు పేర్కొందీ నివేదిక.

ఇదీ చూడండివచ్చే వర్షాకాలం గడ్డుకాలమే: స్కైమెట్​

ABOUT THE AUTHOR

...view details