తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఎస్పీ నయా వ్యూహం- బరిలో మాజీ జవాన్​ - ఎస్పీ

ప్రధాని నరేంద్రమోదీపై పోటీకి మాజీ సైనికుడిని బరిలోకి దింపింది సమాజ్​వాది పార్టీ. వారణాసి లోక్​సభ స్థానానికి బీఎస్​ఎఫ్​ మాజీ కానిస్టేబుల్​ తేజ్​ బహదూర్​ యాదవ్​కు టికెట్​ ఇచ్చింది.

తేజ్​ బహదూర్​ యాదవ్​

By

Published : Apr 29, 2019, 4:53 PM IST

ప్రధాని నరేంద్రమోదీ పోటీచేస్తున్న వారణాసిలో అభ్యర్థిని మార్చింది సమాజ్​వాది పార్టీ. బీఎస్​ఎఫ్​ మాజీ కానిస్టేబుల్​ తేజ్​ బహదూర్​ యాదవ్​ను పోటీలో నిలిపింది. ఎస్పీ తరఫున వారణాసి నుంచి నామపత్రం దాఖలు చేశారు శాలిని యాదవ్​.

తేజ్​ బహదూర్​ యాదవ్​

"సమాజ్​వాది పార్టీలో డమ్మీ అభ్యర్థులు ఉండరు. పార్టీ కోసం మేం పని చేస్తాం. ఇప్పుడు తేజ్​ బహదూర్​ను బరిలోకి నింపాలని పార్టీ నిర్ణయించింది. ఇద్దరు అభ్యర్థుల విషయంలో రేపు సమావేశంలో ఏం చెయ్యాలో పార్టీ నిర్ణయం తీసుకుంటుంది."
- ఎస్పీ అధికార ప్రతినిధి, వారణాసి నియోజకవర్గం

సైనికులకు ఇచ్చే ఆహారం సరిగా లేదని వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో విడుదల చేసినందుకు తేజ్​ బహదూర్​ ఉద్యోగం కోల్పోయారు.

వారణాసి లోక్​సభ స్థానానికి ఏడో దశలో భాగంగా మే 19న ఎన్నికలు జరుగుతాయి. వచ్చే సోమవారం నామినేషన్​కు చివరి గడువు.

ఇదీ చూడండి:'మోదీకి కుల రాజకీయ రంగు పులమొద్దు'

ABOUT THE AUTHOR

...view details