తెలంగాణ

telangana

ETV Bharat / bharat

రోడ్డు ప్రమాదాల నివారణకు.. త్రీడీ చిత్రాలు

రోడ్డు ప్రమాదాల నివారణకు గుజరాత్ అహ్మదాబాద్​కు చెందిన ఇద్దరు కళాకారిణులు త్రీడీ చిత్రాలు రూపొందించారు. ఫలితంగా అక్కడ రోడ్డు ప్రమాదాలు గణనీయంగా తగ్గిపోయాయి. వారి కృషిని అందరూ ప్రశంసిస్తున్నారు.

రోడ్డు ప్రమాదాల నివారణకు.. త్రీడీ చిత్రాలు

By

Published : Jun 30, 2019, 5:02 AM IST

రోడ్డు ప్రమాదాల నివారణకు.. త్రీడీ చిత్రాలు

త్రీడీ చిత్రాలతో రోడ్డు ప్రమాదాలను నివారిస్తున్నారు గుజరాత్​కు చెందిన కళాకారిణులు. అహ్మదాబాద్​కు చెందిన సౌమ్య, శుక్తలాబెన్​ పాండ్య... తాము గీసే చిత్రాలతో ప్రమాదాలను నివారిస్తూనే సామాజిక సందేశాలనూ అందిస్తున్నారు.

కెరీర్ ప్రారంభంలో వారు కార్పొరేషన్​ అనుమతితో కంకారియా సరస్సు తీరంలో త్రీడీ పెయింటింగ్స్ వేశారు. ఆ చిత్రాల పరిమాణాన్ని కాలక్రమేణా పెంచుతూ వచ్చారు.

ప్రమాదాల నివారణ మొదలైందిలా...

ఈ ఇద్దరు చిత్రకారిణులు గీసిన చిత్రాలు ట్రాన్స్​పోర్ట్ కంపెనీ అధికారులను మెప్పించాయి. సౌమ్య, శుక్తలాబెన్​లనూ కలిసి తరచూ జరుగుతున్న రోడ్డు ప్రమాదాల నివారణకు పరిష్కారాన్ని సూచించాలని కోరారు.

ప్రమాదాల నివారణకు త్రీడీ చిత్రాలు రూపొందించాలని నిర్ణయించారు సౌమ్య, శుక్తలాబెన్​ . మూడు నెలల పాటు మొక్కవోని దీక్షతో రకరకాల ప్రయోగాలు చేశారు. తక్కువ సమయంలోనే రోడ్డు ప్రమాదాలు నివారించేలా ఓ చక్కని డిజైన్​ను రూపొందించారు.

చాలా దూరం నుంచే కనిపించే ఈ చిత్రాలు రోడ్డుపై గుంతలు సహా వివిధ రకాల అవాంతరాలు ఉన్నట్లుగా భ్రమపరుస్తాయి. రోడ్డుపై గుంత ఉందని భావించి వేగాన్ని తగ్గించుకుంటారు చోదకులు.

సౌమ్య, పాండ్య రూపొందించిన ఈ త్రీడీ చిత్రాల వల్ల జాతీయ రహదారిపై ట్రాఫిక్ నియంత్రణ అదుపులోకి వచ్చి... ప్రమాదాలు బాగా తగ్గిపోయాయి. ఈ ఇద్దరు చిత్రకారిణుల కృషి పలువురి ప్రశంసలు అందుకుంటోంది.

ఇదీ చూడండి: భారత్​ చేరుకున్న ప్రధాని మోదీ

ABOUT THE AUTHOR

...view details