తెలంగాణ

telangana

ETV Bharat / bharat

మోదీ తెలుగు డైలాగ్​పై చిదంబరం ఇంగ్లిష్ పంచ్​ - చిదంబరం

హౌడీ మోదీ వేదికగా 'భారత్​లో అంతా బాగుంది' అంటూ తెలుగు సహా వేర్వేరు భాషల్లో వ్యాఖ్యానించిన ప్రధాని మోదీపై విమర్శలు గుప్పించారు కేంద్ర మాజీ మంత్రి చిదంబరం. దేశంలో ప్రధాన సమస్యలు మినహా అన్నీ బాగున్నాయి అంటూ ఎద్దేవా చేశారు. సోనియా గాంధీ, మన్మోహన్​ సింగ్​లు సోమవారం తిహార్​ జైలులో ఆయనను కలిసిన సందర్భంగా ఈ విధంగా వ్యాఖ్యానిస్తూ ట్వీట్​ చేశారు చిదంబరం.

మోదీ తెలుగు డైలాగ్​పై చిదంబరం ఇంగ్లిష్ పంచ్​

By

Published : Sep 23, 2019, 12:47 PM IST

Updated : Oct 1, 2019, 4:35 PM IST

మోదీ తెలుగు డైలాగ్​పై చిదంబరం ఇంగ్లిష్ పంచ్​

హ్యూస్టన్​లో ప్రవాస భారతీయులు ఆదివారం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హౌడీ మోదీ కార్యక్రమంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగించారు. ఈ సందర్భంగా దేశంలో 'అంతా బాగుంది' అని తెలుగుతో పాటు వివిధ భాషల్లో అన్నారు మోదీ. ప్రధాని డైలాగ్​పై కేంద్ర మాజీ మంత్రి పి. చిదంబరం విమర్శనాస్త్రాలు సంధించారు. నిరుద్యోగం వంటి సమస్యలను ప్రస్తావిస్తూ కుటుంబ సభ్యుల సాయంతో ట్వీట్​ చేశారు.

"భారత్​లో నిరుద్యోగం, ఉద్యోగాల కోత, తక్కువ వేతనాలు, మూక దాడులు, కశ్మీర్​లో ఉద్రిక్త వాతావరణం, విపక్ష నేతలను జైలుకు పంపటం మినహా అంతా బాగుంది. "
-పి.చిదంబరం, కేంద్ర మాజీ మంత్రి.

తిహార్​ జైలుకు సోనియా, మన్మోహన్...

ఐఎన్​ఎక్స్​ మీడియా కేసులో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటూ తిహార్​ జైలులో జుడిషీయల్​​ రిమాండ్​లో ఉన్న చిదంబరంతో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్​ సింగ్​ సోమవారం సమావేశమయ్యారు. సుమారు 30 నిమిషాల పాటు మాట్లాడారు. ఆయన ఆరోగ్య సమాచారాన్ని అడిగి తెలుసుకున్నారు. ఆయనపై ఉన్న కేసులో రాజకీయంగా పోరాడేందుకు పార్టీ మద్దతు ఇస్తుందని హామీ ఇచ్చారు సోనియా.

కాంగ్రెస్​ నేతలతో పాటు ఆయన కుమారుడు కార్తీ చిదంబరం ఉన్నారు. సోనియా, మన్మోహన్​లకు కృతజ్ఞతలు తెలిపారు కార్తీ.

కాంగ్రెస్​ బలంగా ఉంది..

అగ్రనేతలు సోనియా గాంధీ, మన్మోహన్​ సింగ్​ తనను కలిసేందుకు జైలుకు రావటం తనకు దక్కిన గౌరవమని పేర్కొన్నారు చిదంబరం. కాంగ్రెస్​తో పాటు తానూ బలంగా, ధైర్యంగా ఉన్నట్లు ట్వీట్​ చేశారు.

ఐఎన్​ఎక్స్​ మీడియా కేసులో భాగంగా సెప్టెంబర్ 5 నుంచి తిహార్‌ జైల్లో రిమాండ్‌లో ఉన్నారు చిదంబరం.

ఇదీ చూడండి: ఆయన భార్యకు మోదీ ఎందుకు సారీ చెప్పారంటే..

Last Updated : Oct 1, 2019, 4:35 PM IST

ABOUT THE AUTHOR

...view details