జాతీయ పార్టీ కాంగ్రెస్కు తాత్కాలిక అధ్యక్షురాలిగా సోనియా గాంధీ ఎన్నికయ్యారు. దిల్లీ సీడబ్ల్యూసీ భేటీలో ఈ నిర్ణయం తీసుకుంది కమిటీ. పార్టీ అధ్యక్ష బాధ్యతలను రాహుల్ అంగీకరించనందున నేతలంతా కలిసి సోనియాను అధ్యక్షురాలిగా ఎన్నుకున్నట్లు ప్రకటించారు సీనియర్ నేత గులాం నబీ ఆజాద్.
కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షురాలిగా సోనియా గాంధీ
కాంగ్రెస్ పార్టీ నూతన అధ్యక్షురాలిగా సోనియా గాంధీ ఎన్నికయ్యారు. దిల్లీలో జరిగిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ(సీడబ్ల్యూసీ) సమావేశంలో ఈ నిర్ణయం తీసుుకున్నారు. అయితే ఏఐసీసీ ఛైర్పర్సన్... సోనియా పార్టీ తాత్కాలిక సారథిగానే కొనసాగనున్నారు.
కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షురాలిగా సోనియా గాంధీ
లోక్సభ ఎన్నికల్లో పార్టీ ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ మే 25న అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు రాహుల్. అనంతరం.. పార్టీలో నాయకత్వ లేమి స్పష్టంగా కనిపించింది. నేడు భేటీ అయిన సీడబ్ల్యూసీ.. దేశవ్యాప్తంగా నేతల అభిప్రాయం తెలుసుకునేందుకు వర్కింగ్ కమిటీ సభ్యులతోనే 5 బృందాలను ఏర్పాటు చేసింది.