తెలంగాణ

telangana

ETV Bharat / bharat

హరియాణా ఎన్నికల ప్రచారంలో సోనియా గాంధీ - రాహుల్​ గాంధీ ఎన్నికల ప్రచారం

కాంగ్రెస్​ పార్టీ అధ్యక్షురాలిగా ఇటీవల బాధ్యతలు చేపట్టిన అనంతరం.. సోనియా గాంధీ నేడు తొలిసారిగా ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. హరియాణా మహేంద్రగఢ్​లో నిర్వహించనున్న భారీ బహిరంగ సభకు కాంగ్రెస్​ చీఫ్​ హాజరవనున్నారు.

హరియాణా ఎన్నికల ప్రచారంలో సోనియా గాంధీ

By

Published : Oct 18, 2019, 6:05 AM IST

Updated : Oct 18, 2019, 8:02 AM IST

హరియాణా ఎన్నికల ప్రచారంలో సోనియా గాంధీ

కాంగ్రెస్​ అధ్యక్షురాలు సోనియా గాంధీ మళ్లీ ఎన్నికల ప్రచార బరిలోకి దిగుతున్నారు. సార్వత్రిక ఎన్నికల ప్రచారానికి దూరంగా ఉన్న ఆమె... హరియాణా శాసనసభ ఎన్నికల కోసం హస్తం పార్టీ​ తరఫున నేడు ప్రచారం చేయనున్నారు.

మహేంద్రగఢ్​లోని ప్రభుత్వ కళాశాల క్రీడా ప్రాంగణంలో భారీ బహిరంగ సభలో పాల్గొనున్నారు సోనియా. కాంగ్రెస్​ ప్రధాన కార్యదర్శి, హరియాణా కాంగ్రెస్​ వ్యవహారాల బాధ్యుడు గులాం నబీ ఆజాద్​, మాజీ ముఖ్యమంత్రి భూపిందర్​ సింగ్​ హుడా, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కుమారి సెల్జా, ఇతర స్థానిక నాయకులు, కార్యకర్తలు ఈ సభకు హాజరుకానున్నారు.

దేశంలో భాజపా అనుకూల పవనాలు బలంగా వీస్తున్న ప్రస్తుత తరుణంలో హరియాణా, మహారాష్ట్రల్లో అధికారంలోకి రావాలని చూస్తోంది కాంగ్రెస్​. ఇప్పటికే మహారాష్ట్ర, హరియాణాల్లో కాంగ్రెస్​ మాజీ అధ్యక్షుడు, సోనియా తనయుడు రాహుల్​ గాంధీ పార్టీ ప్రచార బాధ్యతలను నిర్వర్తిస్తున్నారు. అక్టోబర్​ 21న జరగనున్న ఎన్నికల కోసం రెండు రాష్ట్రాల్లో విస్తృతంగా పర్యటిస్తున్నారు.

అయితే... కొంత కాలంగా ఎన్నికల ప్రచారాలకు దూరంగా ఉంటున్న సోనియా స్వయంగా రంగంలోకి దిగడం ప్రాధాన్యం సంతరించుకుంది. 2017 ఉత్తర్​ప్రదేశ్​ ఎన్నికల సమయంలో అస్వస్థతకు గురైన సోనియా... కొద్ది కాలం ప్రచారాల్లో పాల్గొనలేదు. 2019 సార్వత్రిక ఎన్నికల ప్రచారానికీ దూరంగానే ఉన్నారు.

Last Updated : Oct 18, 2019, 8:02 AM IST

ABOUT THE AUTHOR

...view details