తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఓం, ఆవు పదాలు చెబితే విపక్షాలకు దడ : మోదీ

దేశంలో పశు సంపద మరింత పెరగాల్సిన అవసరముందని అభిప్రాయపడ్డారు ప్రధాని మోదీ. గ్రామాల్లోని ప్రతి ఇంట్లో ఒక ఆవు ఉండాలని ఆకాంక్షించారు. ఓం, ఆవు పదాలు చెబితే విపక్షాలు ఉలిక్కిపడుతున్నాయని ధ్వజమెత్తారు.

ఓం, ఆవు పదాలు చెబితే విపక్షాలకు దడ : మోదీ

By

Published : Sep 11, 2019, 7:16 PM IST

Updated : Sep 30, 2019, 6:24 AM IST

గ్రామాలే పెద్దపీటగా ఉన్న భారతదేశంలో పశు సంపదకు ఎంతో ప్రాముఖ్యం ఉందన్నారు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ. పశువుల్లో వ్యాధులను అరికట్టేందుకు ఉద్దేశించిన కార్యక్రమాన్ని ఉత్తర్​ప్రదేశ్​ మథురలో ప్రారంభించారు ఆయన.

విపక్షాల తీరుపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు మోదీ. ఓం, ఆవు పేర్లు చెబితే వారు ఉలిక్కిపడుతున్నారని విమర్శించారు.

ఓం, ఆవు పదాలు చెబితే విపక్షాలకు దడ : మోదీ

"ఆఫ్రికాలో రువాండా అనే దేశం ఉంది. అక్కడ ఒక ప్రత్యేక వ్యవస్థ ఉంది. అక్కడి ప్రభుత్వం రువాండలోని గ్రామాలకు ఆవులను అందిస్తుంది. అయితే ఆ ఆవుకు పుట్టబోయే మొదటి ఆడ లేగదూడను ప్రభుత్వం తీసుకునేలా ఒక నియమం ఉంది. ఆ దూడను ఆవులేని మరొక కుటుంబానికి అందిస్తుంది. ఈ పద్ధతి ఇలా కొనసాగుతూ ఉంటుంది.
కానీ... మన దేశంలో మాత్రం దురదృష్టకర పరిస్థితి ఉంది. 'ఓం', 'ఆవు' అనే పదాలు వినిపించగానే కొందరు ఉలిక్కిపడతారు. దేశం 16-17వ శతాబ్దంలోకి వెళ్లిపోయినట్టు భావిస్తారు. దేశాన్ని భ్రష్టుపట్టించాలని కంకణం కట్టుకుని, అందుకు వచ్చే ఏ అవకాశాన్నీ వదులుకోని వ్యక్తులే ఇలాంటి జ్ఞానం కలిగి ఉంటారు."
- నరేంద్ర మోదీ, ప్రధాన మంత్రి

Last Updated : Sep 30, 2019, 6:24 AM IST

ABOUT THE AUTHOR

...view details