తెలంగాణ

telangana

ETV Bharat / bharat

పాకిస్థాన్​ కవ్వింపు చర్యలకు మరో జవాన్​ బలి - కాల్పులు

గురువారం జమ్ముకశ్మీర్​ రాజౌరీ జిల్లాలోని నియంత్రణ రేఖ వెంబడి పాకిస్థాన్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. పాక్​ దళాలు మోర్టర్​ బాంబులను విసరటం వల్ల ఓ భారత జవాను ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఏడాదిలో ఇప్పటికే 110 సార్లు కాల్పుల విరమణ​ ఒప్పందాన్ని పాక్ ఉల్లంఘించినట్లు అధికారులు తెలిపారు.

పాకిస్థాన్​ కవ్వింపు చర్యలకు మరో జవాన్​ బలి

By

Published : Mar 21, 2019, 1:02 PM IST

Updated : Mar 21, 2019, 5:32 PM IST

కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించిన పాక్​

గురువారం జమ్ముకశ్మీర్​లోని రాజౌరీ జిల్లా​ సుందర్బాని సెక్టార్​లో కాల్పులకు తెగబడ్డాయి పాక్​ బలగాలు. భారత జవాన్లే లక్ష్యంగా మోర్టార్​ బాంబులు విసిరింది. ఈ దాడిలో ఓ భారత జవాను ప్రాణాలు కోల్పోయాడు.

శాంతి కోరుకుంటున్నామని ప్రసంగాలుచేస్తూనే... సరిహద్దులో కవ్వింపు చర్యలకు పాల్పడుతోంది పాకిస్థాన్​. జవాన్లు, పౌరులపై కాల్పులకు తెగబడుతోంది. ఈ ఏడాది ప్రారంభం నుంచి ఇప్పటి వరకు 110 సార్లు కాల్పుల విరమణ ఒప్పందాన్ని పాకిస్థాన్​ ఉల్లంఘించిందని అధికారులు తెలిపారు.

ఇద్దరు పోలీసులకు గాయాలు

జమ్ముకశ్మీర్​ బారముల్లా జిల్లా సోపోర్​లో బలగాలపై ముష్కరులు గ్రెనేడ్​ దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో ఇద్దరు పోలీసులు గాయపడ్డారు. వీరు సమీప ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. దాడికి పాల్పడిన తీవ్రవాదుల కోసం భద్రతా బలగాలు గాలిస్తున్నాయి.

Last Updated : Mar 21, 2019, 5:32 PM IST

ABOUT THE AUTHOR

...view details