సూర్యుడు, చంద్రుడు ఒకే వరుసలోకి వచ్చిన సూర్య గ్రహణ దృశ్యాలు అద్భుతంగా ఆవిష్కృతమయ్యాయి. ఉదయం 9.15 గంటలకు గ్రహణం ప్రారంభమైంది. మధ్యాహ్నం 12.10 నిమిషాలకు సూర్యుడు, చంద్రుడు ఒకే వరుసలోకి వచ్చిన నేపథ్యంలో సంపూర్ణ సూర్యగ్రహణం కాగా.. వలయాకారంలో దర్శనమిచ్చాడు రవి.
దిల్లీ, జమ్ముకశ్మీర్, గుజరాత్, హిమాచల్ ప్రదేశ్, రాజస్థాన్లో గ్రహణ దృశ్యాలు కనువిందు చేశాయి. ఆసియా, ఆఫ్రికా, ఐరోపా, ఆస్ట్రేలియా, పసిఫిక్, హిందూ మహా సముద్ర ప్రాంతాల నుంచి గ్రహణం దృశ్యాలు కనిపించాయి.
గ్రహణం కారణంగా దేశవ్యాప్తంగా ఉన్న అన్ని ఆలయాలను మూసేశారు అధికారులు.
దిల్లీలో మేఘాల్లో గ్రహణ సూర్యుడు..
దేశ రాజధాని దిల్లీలో సంపూర్ణ సూర్యగ్రహణం వేళ ఆకాశాన్ని దట్టంగా మేఘాలు కమ్మేశాయి. నలుపు మేఘాల మధ్య గ్రహణ సూర్యుడు లీలగా కనిపించాడు.