తెలంగాణ

telangana

ETV Bharat / bharat

విద్యుదాఘాతం... తల్లి, ఐదుగురు బిడ్డలు సజీవదహనం

ఉత్తర్​ప్రదేశ్ ఘాజియాబాద్​లో దారుణం జరిగింది. షార్ట్​ సర్క్యూట్​ కారణంగా ఓ ఇల్లు దగ్ధమైంది. ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు మృతి చెందారు. అందులో ఐదుగురు చిన్నారులే.

Six people including five children were electrocuted to death at a house in Loni, due to short circuit.
షార్ట్​సర్క్యూట్​తో ఇల్లు దగ్ధం- తల్లి, ఐదుగురు బిడ్డలు సజీవదహనం

By

Published : Dec 30, 2019, 3:31 PM IST

Updated : Dec 30, 2019, 5:33 PM IST

ఉత్తర్​ప్రదేశ్​ ఘాజియాబాద్​లోని లోనీలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఓ ఇంట్లో షార్ట్​ సర్క్యూట్​ కారణంగా ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు సజీవ దహనమయ్యారు.

విద్యుదాఘాతం... తల్లి, ఐదుగురు బిడ్డలు సజీవదహనం

లోనిలోని బోర్డర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న బెహతా హాజీపూర్ మౌలానా ఆజాద్ కాలనీలో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 40 ఏళ్ల పర్వీన్​ సహా ఆమె కుమార్తెలు ఫాత్మా, సాహిమా, రతియా.. కుమారులు అబ్దుల్​ అజీమ్​, అబ్దుల్​ అహాద్​ మృతి చెందారు. వీరంతా 5 నుంచి 12 ఏళ్ల లోపు పిల్లలే కావడం స్థానికుల హృదయాలను కలచివేసింది.

ఇదీ చదవండి:కదులుతున్న రైలులో విన్యాసం- యువకుడి దుర్మరణం

Last Updated : Dec 30, 2019, 5:33 PM IST

ABOUT THE AUTHOR

...view details