ఇంటి పైకప్పు కూలి ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు మృతి చెందారు. కర్ణాటకలోని బీదర్ జిల్లా బసవకల్యాణ పట్టణం చిల్లా కాలనీలో ఈ విషాదం చోటు చేసుకుంది. తల్లిదండ్రులతో పాటు నలుగురు పిల్లలు ఈ ఘటనలో మరణించారు.
ఇంటి పైకప్పు కూలిన సందర్భంలో ఘటన స్థలంలోనే తల్లిదండ్రులు మరణించారు. తీవ్ర గాయాలైన పిల్లలను ఆసుపత్రికి తరలించి చికిత్స అందించే క్రమంలో మృతి చెందారు.