తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'బంగాల్​లో శాంతి భద్రతలకు ఢోకా లేదు'

బంగాల్​లో పరిస్థితులు అదుపులోనే ఉన్నాయని కేంద్రానికి మమతా బెనర్జీ సర్కారు తెలిపింది. హింసాత్మక ఘటనల్లో ఎటువంటి ఆలస్యం చేయకుండా వెంటనే కఠిన చర్యలకు ఉపక్రమిస్తున్నట్లు ఆ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాలాయ్​ కుమార్​డే కేంద్రానికి లేఖ రాశారు.

By

Published : Jun 10, 2019, 5:32 AM IST

'బంగాల్​లో శాంతి భద్రతలకు ఢోకా లేదు'

'బంగాల్​లో శాంతి భద్రతలకు ఢోకా లేదు'

బంగాల్‌లో శాంతి భద్రతలు పూర్తిగా అదుపులోనే ఉన్నాయని మమతా బెనర్జీ ప్రభుత్వం కేంద్రానికి తెలిపింది. సార్వత్రిక ఎన్నికల తర్వాత బంగాల్లో పెద్ద ఎత్తున ఘర్షణలు చెలరేగిన నేపథ్యంలో కేంద్రం నివేదిక కోరగా ఈ మేరకు వివరణ ఇచ్చింది.

ఇటీవల తృణమూల్​ కాంగ్రెస్-భాజపా శ్రేణుల మధ్య జరిగిన ఘర్షణల్లో నలుగురు మృతి చెందారు. ఈ విషయంపై ఆందోళన వ్యక్తం చేసిన కేంద్రం నివేదిక కోరింది. బంగాల్‌ ప్రభుత్వం ఈ మేరకు రాష్ట్రంలో తాజా పరిస్థితులపై లేఖ రాసింది.

సమస్యాత్మక ప్రాంతాల్లో పోలీసులు నిత్యం పహారా కాస్తున్నట్లు లేఖలో రాష్ట్ర సర్కారు పేర్కొంది. ఘర్షణ జరిగిన ఘటనలపై ఇప్పటికే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వివరించారు.

హింసాత్మక ఘటనలకు బాధ్యులైన వారిపై ఆలస్యం చేయకుండా వెంటనే కఠిన చర్యలు తీసుకోనున్నట్లు బంగాల్​ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మలాయ్‌ కుమార్‌డే కేంద్రానికి తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details