తెలంగాణ

telangana

ETV Bharat / bharat

అమర్​నాథ్​ యాత్ర లక్ష్యంగా పాక్ సైన్యం​ కుట్ర

అమర్​నాథ్​ యాత్రను పాక్​ సైన్యం, వారు పోషిస్తున్న ఉగ్రవాదులు లక్ష్యంగా చేసుకున్నారని భారత సైన్యం ఆరోపించింది. మూణ్నాలుగు రోజుల నుంచి పరిస్థితులను గమనిస్తుంటే ఇదే విషయం స్పష్టమవుతోందని లెఫ్టినెంట్​ జనరల్ కేజేసే ధిల్లాన్​ తెలిపారు.

డీజేఎస్ ధిల్లాన్

By

Published : Aug 2, 2019, 5:10 PM IST

అమర్​నాథ్​ యాత్రలో పాక్​ సైన్యానికి చెందిన ల్యాండ్​మైన్​ కనిపించిందని లెఫ్టినెంట్​ జనరల్​ కేజేఎస్ ధిల్లాన్​ తెలిపారు. నిఘా సమాచారాన్ని బట్టి చూస్తే అమర్​నాథ్​ యాత్రను పాక్​ సైన్యం, వాళ్లు పోషిస్తున్న ఉగ్రవాదులు లక్ష్యంగా చేసుకున్నారని ధిల్లాన్​ ఆరోపించారు.

కేజేఎస్ ధిల్లాన్​

"నియంత్రణ రేఖ వద్ద పరిస్థితి అదుపులో ఉంది. పాకిస్థాన్​ నుంచి వచ్చే చొరబాట్లను సమర్థంగా అడ్డుకున్నాం. జులై 30న గోర్ సెక్టార్​లో పాకిస్థాన్ నిబంధనలను ఉల్లంఘించి కాల్పులు జరిపింది. అంతిమంగా ఉగ్రవాదులపై విజయమే మా లక్ష్యం. ముఖ్యంగా జైషే మహ్మద్, లష్కరే తొయిబా, హిజ్బుల్ ముజాహిదీన్ ఉగ్రసంస్థలపై. వీటన్నింటినీ చూస్తే కశ్మీర్​ లోయలో శాంతికి విఘాతం కలిగించేందుకే పాక్​ సైన్యం ప్రయత్నిస్తోందని అనిపిస్తుంది. మూణ్నాలుగు రోజుల నుంచి నిఘా సమాచారాన్ని గమనిస్తున్నాం. ప్రస్తుతం జరుగుతున్న అమర్​నాథ్​ యాత్రను వాళ్లు లక్ష్యంగా చేసుకున్నట్లు తెలుస్తోంది. మేం అప్రమత్తంగా ఉన్నాం. అన్ని దారుల్లో పూర్తి స్థాయిలో తనిఖీలు చేస్తున్నాం."

- కేజేఎస్ ధిల్లాన్, లెఫ్టినెంట్ జనరల్

యాత్రికులకు హెచ్చరిక

అమర్​నాథ్​ యాత్రికులకు జమ్ము కశ్మీర్​ ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది. ఉగ్రవాద ముప్పు పొంచి ఉన్న కారణంగా వెనుదిరగాలని సూచించింది. ఆగస్టు 4 తేదీ వరకు వాతావరణం సహకరించని కారణంగా అమర్​నాథ్​ యాత్ర మార్గాన్ని మూసివేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు.

ఇదీ చూడండి: ఉగ్రవాద వ్యతిరేక బిల్లుకు పార్లమెంట్​ ఆమోదం

ABOUT THE AUTHOR

...view details