దేశంలో కరోనా వైరస్ పరిస్థితులు మెరుగుపడుతున్నాయని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్ వెల్లడించారు. దేశంలోని వైరస్ హాట్‌స్పాట్ జిల్లాలు క్రమంగా ప్రభావ రహిత జిల్లాలుగా మారుతున్నాయని పేర్కొన్నారు. దిల్లీ ఎయిమ్స్‌లో కరోనా ఐసోలేషన్ కేంద్రం ఏర్పాట్లను పరిశీలించారు హర్షవర్ధన్. ఎయిమ్స్ ట్రామా కేర్ సెంటర్‌ను సందర్శించి.. పరిస్థితులపై సమీక్షించారు.
'దేశవ్యాప్తంగా కరోనా పరిస్థితుల్లో మెరుగుదల' - COVID-19 hotspots
భారత్‌లో కరోనా పరిస్థితులు మెరుగుపడుతున్నాయని తెలిపారు కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్. వైరస్ ప్రభావిత జిల్లాలు క్రమంగా నాన్ హాట్ స్పాట్ జిల్లాలుగా మారుతున్నట్లు వెల్లడించారు. దిల్లీ ఎయిమ్స్‌ను సందర్శించిన ఆయన అక్కడి పరిస్థితులను సమీక్షించారు.
ఈ సందర్శనలో భాగంగా ట్రామా కేర్ సెంటర్‌లో చికిత్స పొందుతున్న కరోనా వ్యాధిగ్రస్తులతో వీడియో కాలింగ్ ద్వారా మాట్లాడారు హర్షవర్ధన్. చికిత్స జరిగే విధానాన్ని అడిగి తెలుసుకుని వారి నుంచి సూచనలు స్వీకరించారు. డిజిటల్ వేదికల ద్వారా వీడియో, వాయిస్ సాంకేతికలతో.. వైరస్ సోకిన వారిని, అనుమానితులను పర్యవేక్షిస్తున్న ఎయిమ్స్ సిబ్బందిని అభినందించారు. వైరస్ కేసులు ఎక్కువగా ఉన్న రాష్ట్రాల్లో మరింత పటిష్ఠంగా లాక్‌డౌన్‌ను అమలు చేయాలని సూచించారు.
ఇదీ చూడండి:ఒకప్పుడు కాలుష్య కేంద్రాలు- ఇప్పుడు గ్రీన్ జోన్లు