ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్‌పై పారిశ్రామిక వర్గాలు ప్రశంసలు కురిపించాయి. ఓ మహిళా ఆర్థిక మంత్రి విశ్వాసం నింపే బడ్జెట్‌ను ప్రవేశపెట్టారని బయోకాన్ ఛైర్మన్ కిరణ్ మజుందార్ అన్నారు. 25 శాతం ఉన్న కార్పొరేట్ పన్ను పరిధిని విస్తరించడం పెట్టుబడుల చక్రానికి ఊతమిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
" విశ్వాసాన్ని నింపే బడ్జెట్‌ను ఓ మహిళా ఆర్థిక మంత్రి ప్రవేశ పెట్టినందుకు ఒక మహిళా వ్యాపారవేత్తగా నాకు ఎంతో గర్వంగా ఉంది."
-కిరణ్ మజుందార్ షా ట్వీట్.
ఆర్థిక మంత్రి తాత్కాలిక చర్యలపై కాకుండా దీర్ఘకాలిక లక్ష్యాలపై దృష్టి పెట్టారని మహీంద్రా గ్రూప్ ఛైర్మన్ ఆనంద్ మహీంద్రా ట్విట్టర్‌లో పేర్కొన్నారు.
2025 నాటికి భారత్‌ను 5 ట్రిలియన్ల ఆర్థిక వ్యవస్ధగా తీర్చిదిద్దేందుకు నిర్మలా సీతారామన్ తగిన చర్యలు చేపట్టారని భారత పరిశ్రమల సమాఖ్య ( సీఐఐ) అధ్యక్షుడు విక్రమ్ కిర్లోస్కర్ ప్రశంసించారు.