పాకిస్థాన్ నుంచి క్షేమంగా భారత్ చేరుకున్న దళ కమాండర్ అభినందన్ వర్ధమాన్‌ను రక్షణ మంత్రి నిర్మలాసీతారామన్ అభినందించారు. ఆసుపత్రిలో ఉన్న అభినందన్‌ను కలిశారు. ఆమెతోపాటు ఎయిర్‌ఫోర్స్ ఉన్నతాధికారులు ఉన్నారు. అభినందన్ ధైర్యసాహసాలకు దేశం మొత్తం గర్వపడుతోందన్నారు కేంద్రమంత్రి.
"దేశం గర్విస్తోంది" - నిర్మలాసీతారామన్
భారత వైమానిక దళ కమాండర్ అభినందన్ వర్ధమాన్‌ను రక్షణ శాఖ మంత్రి నిర్మలాసీతారామన్ పరామర్శించారు.
అభినందన్ వర్ధమాన్‌ను పరామర్శించిన రక్షణ మంత్రి
పాకిస్థాన్ బలగాల చేతిలో 60 గంటల పాటు గడిపిన క్షణాలు, అక్కడి పరిస్థితులపై రక్షణ మంత్రికి అభినందన్ వివరించినట్లు అధికారులు తెలిపారు.
అఠారి-వాఘా సరిహద్దులో భారత్‌లోకి అడుగుపెట్టిన అభినందన్‌ను సుమారు రెండున్నర గంటల అనంతరం ఐఏఎఫ్ ప్రత్యేక విమానంలో దిల్లీకి తరలించారు. అనంతరం వైద్య పరీక్షలు నిర్వహించారు అధికారులు.