తెలంగాణ

telangana

ETV Bharat / bharat

హోరాహోరీగా సిక్కిం పోరు.. సర్వత్రా ఉత్కంఠ - Assembly

సిక్కిం అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. పవన్​ చామ్లింగ్​ నేతృత్వంలోని సిక్కిం డెమొక్రటిక్​ ఫ్రంట్(ఎస్​డీఎఫ్​)​, సిక్కిం క్రాంతికారి మోర్చా(ఎస్​కేఎం)లు సమాన స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతున్నాయి.

హోరాహోరీగా సిక్కిం పోరు.. సర్వత్రా ఉత్కంఠ

By

Published : May 23, 2019, 6:37 PM IST

ఈశాన్యాన చిన్న రాష్ట్రమైన సిక్కింలో ఎన్నికల పోరు ఆసక్తి రేకెత్తిస్తోంది. సుదీర్ఘకాలం ముఖ్యమంత్రిగా పనిచేసిన నేతగా రికార్డు సృష్టించిన పవన్​చామ్లింగ్​ నేతృత్వంలోని సిక్కిం డెమొక్రటిక్​ ఫ్రంట్​(ఎస్​డీఎఫ్​)కు, ప్రత్యర్థి పార్టీ సిక్కిం క్రాంతికారి మోర్చా(ఎస్​కేఎం)కు మధ్య గట్టి పోటీ కొనసాగుతోంది.

ఈ రాష్ట్రంలో ప్రధాన పోటీ ఈ రెండు పార్టీల మధ్యే. గత అసెంబ్లీ ఎన్నికల్లో 32 స్థానాలకుగాను ఎస్​డీఎఫ్​ 22 గెల్చుకుంది. ఎస్​కేఎం 10 స్థానాల్లో విజయం దక్కించుకుంది. ఇక్కడ జాతీయ పార్టీలైన భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్​ల హవా తక్కువ.

పౌరసత్వ సవరణ బిల్లు, జాతీయ పౌర రిజస్టర్​ వివాదంతో రాష్ట్రంలో సంక్షోభ పరిస్థితి నెలకొంది. దీనిపైనే ప్రతిపక్షాలు ప్రచారం నిర్వహించాయి. రాష్ట్రంలో ఉన్న ఒకే ఒక లోక్​ సభ నియోజకవర్గంలో ఎస్​కేఎం ఆధిక్యంలో ఉంది.

రికార్డులు...

ఆరోసారి ఎన్నికల్లో పోటీకి దిగారు పవన్​ చామ్లింగ్. ఈసారి ముఖ్యమంత్రిగా ఎన్నికైతే.. ఇప్పట్లో ఈయన రికార్డుకు ఎదురే ఉండదు. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఒక రాష్ట్రానికి అత్యధిక కాలం ముఖ్యమంత్రిగా పనిచేసిన నేతగా జ్యోతి బసు రికార్డును ఇప్పటికే అధిగమించారు చామ్లింగ్.

ABOUT THE AUTHOR

...view details