తెలంగాణ

telangana

ETV Bharat / bharat

షాట్​గన్​ కాంగ్రెస్​లో... భార్య 'సమాజ్​వాది'లో - ఉత్తర్​ప్రదేశ్​

ప్రముఖ నటుడు, రాజకీయ నేత శత్రుఘ్న సిన్హా భార్య.. పూనమ్​ సిన్హా సమాజ్​వాది పార్టీలో చేరారు. శత్రుఘ్న ఇటీవలే భాజపాను వీడి.. కాంగ్రెస్​లో చేరారు.

సమాజ్​వాదిలో చేరిన పూనమ్​ సిన్హా

By

Published : Apr 16, 2019, 6:34 PM IST

కాంగ్రెస్​ నేత, ప్రముఖ బాలీవుడ్​ నటుడు శత్రుఘ్న సిన్హా భార్య పూనమ్​ సిన్హా.. సమాజ్​వాది పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. లఖ్​నవూలో ఎస్పీ నేత డింపుల్​ యాదవ్​ ఆధ్వర్యంలో పార్టీలో చేరారు.

లఖ్​నవూ లోక్​సభ స్థానంలో కేంద్ర హోం మంత్రి రాజ్​నాథ్​ సింగ్​పై.. పూనమ్​ సిన్హా బరిలో నిలిచే అవకాశముందని సమాచారం. రాజ్​నాథ్​​ ఈ రోజే ఇక్కడ నామపత్రం దాఖలు చేశారు.

లఖ్​నవూలో పోటీ చేస్తారా అని విలేకరులు అడిగిన ప్రశ్నను దాటవేసే ప్రయత్నం చేశారు పూనమ్. రేపు చెప్తాను అని బదులిచ్చారు. లఖ్​నవూ స్థానంలో ఆమె అభ్యర్థిత్వాన్ని పార్టీ ప్రకటిస్తే.. ఏప్రిల్​ 18న నామినేషన్​ వేసే అవకాశముంది.

లఖ్​నవూ నియోజకవర్గంలో మే 6 న పోలింగ్​ జరగనుంది.

ఇదీ చూడండి:

లఖ్​నవూ నుంచి రాజ్​నాథ్​ సింగ్​ నామినేషన్​

బాధగా ఉన్నా నమ్మకంతో ముందుకు...

ABOUT THE AUTHOR

...view details