కేంద్ర హోం మంత్రి అమిత్ షా జమ్ముకశ్మీర్ లో పర్యటించారు. రాష్ట్ర భద్రతా పరిస్థితులపై ఉన్నతాధికారులతో సమీక్షించారు. కశ్మీర్ ప్రస్తుత స్థితిని అధికారులు షాకు వివరించారు. ఈ భేటీలో జమ్ముకశ్మీర్ గవర్నర్ సత్యపాల్ మాలిక్, కశ్మీర్ భద్రతా వ్యహరాల సలహాదారు కె. విజయ్ కుమార్, భద్రతా కార్యదర్శి రాజీవ్ గౌబ, సైన్య ముఖ్య అధికారులు పాల్గొన్నారు.
పుల్వామా ఘటన అనంతరం కశ్మీర్లో ఉగ్రవాద సంస్థల నాయకులను ఏరివేసేందుకు తీసుకున్న చర్యలను అధికారులు మంత్రికి వివరించారు. మళ్లీ పుల్వామా తరహా దాడులు జరగే వీలు లేకుండా భద్రతా ఏర్పాటు చేసినట్లు సమాచారం అందించారు.
హోంమంత్రిగా బాధ్యతలు చేపట్టాక తొలి పర్యటనకు కశ్మీర్‌ను ఎంచుకున్నారు షా. 27న కూడా కశ్మీర్‌లోనే పర్యటిస్తారు.
షాకు స్వాగతం పలికిన గవర్నర్