తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'పౌర' బిల్లుపై భారతీయ ముస్లింలకు షా భరోసా - Amit Shah

పౌరసత్వ సవరణ బిల్లుపై ఎవరికీ ఎలాంటి అపోహలు అవసరం లేదని స్పష్టం చేశారు కేంద్ర హోంమంత్రి అమిత్​ షా. ఈ బిల్లుతో లక్షలాది మందికి ప్రయోజనం చేకూరుతుందన్న ఆయన.. పౌరసత్వ సవరణ బిల్లు ఏ వర్గానికి వ్యతిరేకం కాదని తేల్చిచెప్పారు. దేశంలోని ముస్లింలు భారత పౌరులుగా ఉన్నారని, అలాగే ఉంటారని ఉద్ఘాటించారు అమిత్​ షా.

Shah moves Citizenship (Amendment) Bill in RS, says Indian Muslims 'were, are and will remain' Indians
'పౌర' బిల్లుపై భారతీయ ముస్లింలకు షా భరోసా

By

Published : Dec 11, 2019, 2:13 PM IST

Updated : Dec 11, 2019, 5:05 PM IST

'పౌర' బిల్లుపై భారతీయ ముస్లింలకు షా భరోసా

వివాదాస్పద 2019 పౌరసత్వ చట్టసవరణ బిల్లును కేంద్ర హోంమంత్రి అమిత్​ షా రాజ్యసభలో ప్రవేశపెట్టారు. అనంతరం బిల్లుపై చర్చ సందర్భంగా.. దేశంలో నివసిస్తున్న మైనారిటీలకు ఈ బిల్లుతో ఏ ప్రమాదం లేదని.. వారు అప్పుడు, ఇప్పుడు, ఎప్పుడూ భారత పౌరులుగానే ఉంటారని తెలిపారు. ఓటు బ్యాంకు రాజకీయాల కోసం బిల్లును తీసుకొచ్చారన్న ఆరోపణలను తోసిపుచ్చారు అమిత్​ షా.

పాకిస్థాన్, బంగ్లాదేశ్​, అఫ్గానిస్థాన్​ నుంచి దేశంలోకి ప్రవేశిస్తున్న అక్రమ వలసదారులను నిరోధించేందుకే ఈ బిల్లు తెచ్చినట్టు స్పష్టం చేశారు షా. విదేశాల నుంచి వచ్చిన ముస్లింలు కాని మైనారిటీలకు పౌరసత్వం ఇస్తామని.. ముస్లింలకు పౌరసత్వం ఇచ్చేది లేదని తేల్చి చెప్పారు.

" దేశంలోని ముస్లింల గురించి ఎటువంటి చర్చగానీ, చింతగానీ అవసరం లేదు. వారు ఎప్పటికీ దేశ పౌరులే. భారత్​లో ఉన్న ఏ ముస్లిం సోదరుడు చింతించొద్దని నేను స్పష్టంగా చెబుతున్నాను. ఎవ్వరికీ భయపడద్దు. పాకిస్థాన్​, బంగ్లాదేశ్, అఫ్గానిస్థాన్ నుంచి వచ్చే ముస్లింలకు భారత పౌరసత్వం ఇస్తామని అనడం ద్వారా ఏం చెప్పాలనుకుంటున్నారు? ప్రపంచ నలుమూలల నుంచి వచ్చే ముస్లింలందరికీ భారత పౌరసత్వం ఇవ్వాలా? అలా ఎలా ఇస్తాం? దేశం ఎలా ముందుకెళ్తుంది?"
- అమిత్​ షా, కేంద్ర హోంమంత్రి

బిల్లుపై అసత్యాలు ప్రచారం చేయడం సమంజసం కాదని విపక్షాలకు సూచించారు షా. ఎన్నికలకు ముందే బిల్లుపై హామీ ఇచ్చామని గుర్తుచేశారు.

షా ప్రసంగం అనంతరం ఈ బిల్లుపై విపక్షాలు తమ గళాన్ని వినిపించాయి.

Last Updated : Dec 11, 2019, 5:05 PM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details