తెలంగాణ

telangana

ETV Bharat / bharat

దిల్లీ కరోనా పరిస్థితులపై కేజ్రీతో 'షా' సమీక్ష

కేంద్ర హోంమంత్రి అమిత్​షా.. దిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ బైజాల్​, ముఖ్యమంత్రి కేజ్రీవాల్​తో సమావేశమయ్యారు. దేశ రాజధానిలో ఉద్ధృతంగా పెరిగిపోతున్న కరోనా కేసులు, మరణాల విషయంపై సమీక్ష నిర్వహించారు. ఈ మహమ్మారి కట్టడిపై తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. ఇవాళ సాయంత్రం అమిత్​ షా.. దిల్లీలోని మూడు మున్సిపల్ కార్పొరేషన్ల మేయర్లతో కూడా సమావేశం కానున్నారు.

Shah holds meeting with Delhi LG, CM on COVID-19 situation
దిల్లీ కరోనా పరిస్థితులపై కేజ్రీతో 'షా' సమీక్ష

By

Published : Jun 14, 2020, 12:00 PM IST

దిల్లీలో కరోనా కేసులు, మరణాల సంఖ్య భారీగా పెరిగిపోతున్న నేపథ్యంలో కేంద్ర హోంమంత్రి అమిత్​షా స్వయంగా రంగంలోకి దిగారు. దిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజాల్​, ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్​తో సమావేశమయ్యారు. కరోనా పరిస్థితులపై సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో ఆరోగ్యశాఖమంత్రి హర్షవర్ధన్, విపత్తు నిర్వహణ శాఖ, ఆరోగ్యశాఖ అధికారులు కూడా పాల్గొన్నారు.

దిల్లీలో కరోనా కేసులు భారీగా పెరిగిపోతున్నాయి. ఇప్పటి వరకు అక్కడ 39,000 కేసులు, 1200కుపైగా మరణాలు నమోదయ్యాయి. దీనితో ఈ మహమ్మారిని కట్టడి చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలపై అమిత్​షా సమీక్ష నిర్వహించారు. అలాగే దిల్లీలో అందుబాటులో ఉన్న కరోనా ఆసుపత్రులు, పడకలు, వైరస్ పరీక్ష కేంద్రాలు, ఆరోగ్య మౌలిక సదుపాయాల అభివృద్ధి లాంటి అంశాలను అడిగి తెలుసుకున్నారు.

మేయర్లతో సమావేశం..

ఇవాళ సాయంత్రం అమిత్​ షా.. దిల్లీలోని మూడు మున్సిపల్ కార్పొరేషన్ల మేయర్లతో సమావేశం కానున్నారు. కరోనా కట్టడికి తీసుకోవాల్సిన చర్యలపై దిశానిర్దేశం చేయనున్నారు.

ఇదీ చూడండి:దేశంలో 24 గంటల్లో 11,929 కేసులు, 311 మరణాలు

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details