తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'పద్మా'లకు పేర్లను నామినేట్ చేయండి: అమిత్ షా

వివిధ విభాగాల్లో అసాధారణ విజయాలు సాధించిన వ్యక్తులను పద్మ అవార్జులకు నామినేట్ చేయాలని ప్రజలను కోరారు  కేంద్ర హోంమంత్రి అమిత్ షా. 2020 సంవత్సరానికి పద్మ అవార్డుల కోసం ఇప్పటివరకు వేల సంఖ్యలో నామినేషన్లు అందాయని తెలిపారు.

'పద్మా'లకు పేర్లను నామినేట్ చేయండి: అమిత్ షా

By

Published : Sep 12, 2019, 8:40 AM IST

Updated : Sep 30, 2019, 7:30 AM IST

ప్రతిష్ఠాత్మక పద్మ అవార్డులను "ప్రజల పద్మ" అవార్డులుగా చేయడానికి ప్రధాని నరేంద్ర మోదీ కట్టుబడి ఉన్నారని చెప్పారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. కళ, విజ్ఞాన శాస్త్రం, సామాజిక సేవ, క్రీడల వంటి వివిధ రంగాల్లో అసాధారణ విజయాలు, విభిన్న కృషి చేసిన వ్యక్తులను పద్మ అవార్డులకు నామినేట్​ చేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. దీని కోసం padmaawards.gov.in వెబ్​సైట్​ను సందర్శించాలని ట్వీట్​ చేశారు షా.

వచ్చే ఏడాది పద్మ అవార్డుల కోసం కేంద్ర హోంమంత్రిత్వ శాఖకు ఇప్పటి వరకు 25వేలకు పైగా నామినేషన్లు అందాయని తెలిపారు అమిత్ షా. నామినేషన్ దాఖలుకు చివరి తేదీ సెప్టెంబరు 15.

విభిన్న రంగాల్లో అసాధారణ ప్రతిభ కనబర్చిన వారికి పద్మ విభూషణ్​, పద్మ భూషణ్, పద్మ శ్రీ పురస్కారాలను ఏటా ప్రదానం చేస్తోంది కేంద్రం. ఈ అవార్డులకు ప్రభుత్వ ఉద్యోగులు, ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేసేవారు మినహా ప్రతి ఒక్కరు అర్హులే.

ప్రధాన మంత్రి ఏర్పాటు చేసిన పద్మ అవార్డుల కమిటీ ముందు నామినేట్ అయిన వ్యక్తుల జాబితాను ఉంచుతారు.

గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని జనవరి 26న పద్మ అవార్డులను ప్రకటిస్తారు.

ఇదీ చూడండి: వాహన చట్టంపై వ్యతిరేకత.. గుజరాత్​ బాటలోనే కర్ణాటక..!

Last Updated : Sep 30, 2019, 7:30 AM IST

ABOUT THE AUTHOR

...view details