హరియాణాలో ఇటీవల దారుణహత్యకు గురైన యువతికి న్యాయం చేయాలాని డిమాండ్ చేస్తూ చేపట్టిన నిరసనలు ఉద్రిక్తతలకు దారితీశాయి. వల్లభ్గఢ్లోని జాతీయ రహదారిపై ఎలాంటి అనుమతి లేకుండా మహాపంచాయతీ నిర్వహించారు ఆందోళనకారులు. వీరిని అడ్డుకునేందుకు రంగంలోకి దిగారు పోలీసులు. శాంతి భద్రతలకు భంగం కలిగిస్తున్నారనే కారణంగా.. కొందరు నిరసనకారుల్ని అదుపులోకి తీసుకున్నారు.
అరెస్టులకు దారితీసిన వల్లభ్గఢ్ మహాపంచాయతీ యువతికి న్యాయం చేయాలని డిమాండ్ అసలేం జరిగిందంటే?
ఫరీదాబాద్ జిల్లాలోని వల్లభ్గఢ్ ప్రాంతంలో అక్టోబర్ 26న.. ఓ విద్యార్థిని పరీక్షరాసి తిరిగి ఇంటికి వస్తుండగా.. పట్టపగలే నడిరోడ్డుపై తుపాకీతో కాల్చిచంపాడో కిరాతకుడు. తనతో పెళ్లికి నిరాకరించిందనే నెపంతో.. ఎలాగైనా ఆమెపై ప్రతీకారం తీర్చుకుంటానని పోలీసులతో ముందే చెప్పి మరీ ఈ దారుణానికి ఒడిగట్టాడు.
ఇదీ చదవండి:హరియాణాలో ఘోరం- పట్టపగలే విద్యార్థిని హత్య