తెలంగాణ

telangana

ETV Bharat / bharat

నల్లధనంపై సిట్​కు ఐదేళ్లు- జులైలో 7వ నివేదిక

ఎన్డీఏ ప్రభుత్వం 'నల్లధనం'పై నియమించిన ప్రత్యేక దర్యాప్తు బృందం తన ఏడో నివేదికను జులై మొదటివారంలో సమర్పించనుంది. మే 23 తర్వాత అధికారంలోకి వచ్చే ప్రభుత్వం ఈ నివేదికను అనుసరించి తగిన చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది.

నల్లధనంపై సిట్​కు ఐదేళ్లు- జులైలో 7వ నివేదిక

By

Published : May 16, 2019, 5:35 PM IST

'నల్లధనం'పై రూపొందించిన 7వ నివేదికను జులై మొదటి వారంలో కేంద్ర ప్రభుత్వానికి సమర్పిస్తామని ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్​) ఉపాధ్యక్షుడు జస్టిస్ అరిజిత్​ పసాయత్​ తెలిపారు. నల్లధనం సమస్య పరిష్కారానికి తదుపరి ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటుందని ఆశాభావం వ్యక్తంచేశారు.

"ఏడో నివేదిక జులై మొదటివారంలో సమర్పిస్తాం. అన్ని విషయాలను ఆ నివేదికలో పొందుపరిచాము. ఇది నల్లధనంపై రూపొందించిన ఏడో నివేదిక. ఇంతకుముందు అన్ని నివేదికలనూ సుప్రీంకోర్టుకు సమర్పించాం."
-జస్టిస్​ పసాయత్, సిట్​ ఉపాధ్యక్షుడు

నల్లధనంపై సిట్​...

2014 సార్వత్రిక ఎన్నికల్లో భాజపా ప్రధాన ప్రచార అస్త్రాల్లో 'నల్లధనం సమస్య' ఒకటి. అధికారంలోకి వచ్చాక ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మొదటి మంత్రివర్గ సమావేశంలోనే 'నల్లధనం'పై చర్చించారు. సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్​ ఎమ్​.బి.షా నేతృత్వంలో ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటుచేశారు.

మే 23 తరువాత భాజపా మళ్లీ అధికారంలోకి వస్తే... నల్లధనం నిర్మూలనకు తీసుకోవాల్సిన చర్యలు, సలహాలు ఈ నివేదిక రూపంలో సిద్ధంగా ఉంటాయి.

నోట్ల రద్దు నల్లధనాన్ని అరికట్టగలిగిందా?

దేశ, విదేశాల్లో ఉన్న నల్లధనాన్ని అరికట్టేందుకు మోదీ ప్రభుత్వం పెద్దనోట్ల రద్దు పథకాన్ని అమలు చేసింది. రూ.500, రూ.1000 నోట్ల చలామణిని నిలిపివేసింది. అయితే ఈ 'నోట్లరద్దు' ప్రభావం విషయంలో ఆర్థికవేత్తలు, విధాన నిర్ణేతల్లో అనుమానాలు, భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.

విధాన నిర్ణేతలు భారత్​, ఇండోనేషియాల్లో చేపట్టిన 'నోట్ల రద్దు' చర్యలను పోల్చి చూశారు. ఇండోనేషియాలో నోట్ల రద్దు ప్రభావం వల్ల పన్ను చెల్లింపుదారులు సుమారు 350 బిలియన్ డాలర్లు విలువైన ఆస్తులను ప్రకటించారు.

భారత్​ విషయానికి వస్తే 'ఆదాయ ప్రకటన పథకం' (ఐడీఎస్​)-2016 ను అనుసరించి భారతీయులు రూ.65,250 కోట్లు విలువైన ఆస్తులను ప్రకటించారు. విదేశాల్లో ఉన్న నల్లధనంపై జరిమానా, పన్ను రూపంలో రూ.2,428 కోట్లు ఖజానాలో చేరాయి.

నల్లధనాన్ని అరికట్టడానికి నోట్లరద్దు మాత్రమే కాక... వ్యక్తిగతంగా నగదు కలిగి ఉండడంపై పరిమితులు విధించడం సహా ఆదాయ పన్ను చట్టాల్లో లొసుగులు పూరించడానికి చర్యలు తీసుకుంది భాజపా ప్రభుత్వం.

ఇదీ చూడండి: బోఫోర్స్ కేసు విచారణపై వెనక్కు తగ్గిన సీబీఐ

ABOUT THE AUTHOR

...view details