తెలంగాణ

telangana

ETV Bharat / bharat

కేంద్ర మాజీ మంత్రి 'హన్సరాజ్​ భరద్వాజ్'​ కన్నుమూత - కేంద్ర న్యాయశాఖ మాజీ మంత్రి

కేంద్ర మాజీ మంత్రి హన్సరాజ్​ భరద్వాజ్​ ఆదివారం కన్నుమూశారు. మూత్రపిండాల సమస్యతో బుధవారం దిల్లీలోని ఆస్పత్రిలో చేరిన ఆయన గుండెపోటు రావటం వల్ల తుదిశ్వాస విడిచారు.

Hans Raj Bhardwaj dies
కేంద్ర మాజీ మంత్రి 'హన్సరాజ్​ భరద్వాజ్'​ కన్నుమూత

By

Published : Mar 8, 2020, 11:08 PM IST

Updated : Mar 9, 2020, 6:38 AM IST

కేంద్ర న్యాయశాఖ మాజీ మంత్రి, కాంగ్రెస్​ సీనియర్​ నేత హన్సరాజ్​ భరద్వాజ్​ (83) కన్నుమూశారు. దిల్లీలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయనకు గుండెపోటు రావటం వల్ల ఆదివారం సాయంత్రం తుది శ్వాస విడిచారు.

మూత్ర పిండాల సమస్యతో గత బుధవారం దిల్లీలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేరినట్లు ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు. నిఘమ్​బోధ్​ ఘాట్​లో సోమవారం మధ్యాహ్నం 4 గంటలకు అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు.

కేంద్ర న్యాయశాఖ మంత్రి సహా కేరళ, కర్ణాటక రాష్ట్రాల గవర్నర్​గా విధులు నిర్వర్తించారు హన్సరాజ్​. ఆయనకు భార్య, ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు.

మోదీ సంతాపం..

హన్సరాజ్​ భరద్వాజ్​ మృతి పట్ల సంతాపం తెలిపారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. ఆయన కుటుంబ సభ్యులు, బంధువులకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. ఈ మేరకు ప్రధానమంత్రి కార్యాలయం ట్వీట్​ చేసింది.

ప్రధాని మోదీ ట్వీట్​

భరద్వాజ్​ ఆత్మకు శాంతి చేకూరాలి..

హన్సరాజ్​ భరద్వాజ్​ మృతి పట్ల ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి ప్రకటించారు న్యాయశాఖ మంత్రి రవిశంకర్​ ప్రసాద్​. పార్లమెంట్​లో ఆయనతో కలిసి పని చేసిన రోజులను గుర్తుచేసుకున్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ట్వీట్​ చేశారు.

రవిశంకర్​ ప్రసాద్​ ట్వీట్​

ఇదీ చూడండి: ఉగ్ర సంస్థతో సంబంధాలున్న దంపతుల అరెస్ట్​!

Last Updated : Mar 9, 2020, 6:38 AM IST

ABOUT THE AUTHOR

...view details