ఉత్కంఠభరిత మలుపుల అనంతరం మహా ప్రతిష్టంభనకు తెరపడింది. ముఖ్యమంత్రిగా శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రే రేపు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇక మిగిలింది పదవుల పంపకాలు మాత్రమే.
శివసేన-ఎన్సీపీ-కాంగ్రెస్ కూటమిలో ఉపముఖ్యమంత్రి సహా ఇతర పదవుల పంపకాలపై రెండు రోజుల్లో స్పష్టత వస్తుందని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఆధ్యక్షుడు బాలాసాహెబ్ థోరట్ వెల్లడించారు. ఎమ్మెల్యేగా ప్రమాణస్వీకారం చేసిన అనంతరం ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.