తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఉద్యోగం పోతేనేం.. వీరిలా ఆలోచన ఉంటే చాలదూ!

లాక్​డౌన్​లో ఉద్యోగాలు కోల్పోయిన ముగ్గురు యువకులు.. బాధను పక్కనపెట్టి వినూత్న ఆలోచనతో తమ కష్టాలకు ఎదురీదారు. తమ వద్ద ఉన్న డబ్బుతో ఓ బస్సును రూఫ్​టాప్​ రెస్టారెంట్​గా మార్చి స్వావలంబన సాధించారు. కరోనా సంక్షోభంలో ఉపాధి కోల్పోయిన వారికి స్ఫూర్తిగా నిలిచారు ఈ యువకులు.

bus restaurant
రూఫ్​టాప్ రెస్టారెంట్

By

Published : Oct 9, 2020, 9:12 PM IST

కరోనా లాక్​డౌన్​ నాటి నుంచి చాలా మంది ప్రజలు తమ ఉద్యోగాలు, ఆదాయాన్ని కోల్పోయారు. ఫలితంగా దేశవ్యాప్తంగా నిరుద్యోగం విజృంభించింది. అయితే, మధ్యప్రదేశ్​లోని ఇందోర్​కు చెందిన ముగ్గురు యువకులు.. ఉపాధి కోల్పోయామని విచారించలేదు. వారి కష్టాలను అవకాశంగా మార్చుకొని విజయం సాధించారు. స్వావలంబనకు చక్కటి ఉదాహరణగా నిలిచారు.

రూఫ్​టాప్ రెస్టారెంట్

ఇందోర్​కు చెందిన ముగ్గురు స్నేహితులు మేనేజ్​మెంట్​, ఇంజినీరింగ్​ రంగాల్లో తమ ఉద్యోగాలు కోల్పోయారు. అయితే, అసాధారణ ఆలోచన వారి జీవితాన్ని మార్చేసింది. ఓ 20 సీట్లున్న బస్సుకు మరమ్మతులు చేసి రూఫ్​టాప్ రెస్టారెంట్​గా మార్చారు. ఇలా అద్దె ఖర్చులతో పాటు ఎక్కడైనా వ్యాపారం చేసుకునే సౌలభ్యం కలిగిందని రెస్టారెంట్ యజమాని వేదాంత శుక్లా ఈటీవీ భారత్​తో చెప్పారు.

"మేం మా పనిలో మంచి నిపుణులమే అయినా.. లాక్​డౌన్​లో ఉద్యోగాలు కోల్పోయాం. మొదట బాధపడినా.. ప్రధాని మోదీ ఆత్మనిర్భర్​ పిలుపుతో స్వయం సమృద్ధి సాధించాలని నిర్ణయించుకున్నాం. ఫుడ్​ కోర్టు ప్రారంభించడానికి ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడ్డాం. మా వద్ద ఉన్నంతలో ఈ రూఫ్​టాప్​ రెస్టారెంట్​ను ప్రారంభించాం."

- వేదాంత శుక్లా, రెస్టారెంట్ యజమాని

కరోనా సంక్షోభంలో ఉపాధి కోల్పోయిన వారికి ఈ యువకుల కథ స్ఫూర్తినిస్తుందని పలువురు అభిప్రాయపడ్డారు.

ఇదీ చూడండి:చెప్పుకోలేక.. ఆపుకోలేక ఇబ్బంది పడుతున్నారా?

ABOUT THE AUTHOR

...view details