తెలంగాణ

telangana

ETV Bharat / bharat

వందేభారత్​ రెండో దశ.. జూన్​ 13వరకు పొడిగింపు

వందే భారత్​ రెండో దశను జూన్​ 13 వరకు పొడిగిస్తున్నట్లు విదేశాంగ శాఖ ప్రకటించింది. ఈ ఫేజ్​లో 47 దేశాల నుంచి భారతీయులను తరలిస్తామని తెలిపింది. అనంతరం మూడో దశ ఉంటుందని విదేశాంగ అధికార ప్రతినిధి స్పష్టం చేశారు.

MEA-INDIANS-LD EVACUATION
వందేభారత్

By

Published : May 22, 2020, 5:31 AM IST

వందేభారత్​ మిషన్​ రెండో దశ జూన్​ 13 వరకు కొనసాగుతుందని కేంద్రం ప్రకటించింది. ఈ దశలో సేవలను మొత్తం 47 దేశాలకు విస్తరిస్తామని తెలిపింది. విదేశాల్లో చిక్కుకున్న భారతీయులను స్వదేశానికి చేర్చేందుకు వందేభారత్​ మిషన్​ను ప్రారంభించింది కేంద్ర ప్రభుత్వం.

తొలుత కేంద్రం నిర్ణయించిన దాని ప్రకారం మే 22న రెండో దశ ముగియనుంది. అయితే తాజాగా వచ్చే నెల రెండో వారం వరకు పొడిగించినట్లు విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి అనురాగ్​ శ్రీవాత్సవ తెలిపారు. జూన్ 13 తర్వాత మూడో దశ ఉంటుందని స్పష్టం చేశారు.

"47 దేశాల నుంచి 162 విమానాల ద్వారా భారతీయులను తీసుకురానున్నాం. ఇస్తాంబుల్​, హోచిమిన్​ సిటీ, లాగోస్​ తదితర ప్రాంతాలకూ సేవలను విస్తరిస్తాం. అమెరికా, ఐరోపాలకు సర్వీసులు పెంచుతాం."

- అనురాగ్ శ్రీవాత్సవ

ఇప్పటివరకు 23,475 మందిని దేశానికి తీసుకొచ్చినట్లు శ్రీవాత్సవ తెలిపారు. మే 7 నుంచి 15 మధ్య నిర్వహించిన మొదటి దశలో భాగంగా.. 15 వేల మందిని తరలించామన్నారు. భారత్​కు వచ్చేందుకు మొత్తం 98 దేశాల్లోని 2,59,001 మంది దరఖాస్తు చేసుకున్నారని స్పష్టం చేశారు. వందే భారత్‌ మిషన్‌లో పాలుపంచుకునేలా కేంద్ర విమానయాన శాఖ ప్రైవేటు ఎయిర్‌లైన్స్‌తో చర్చలు జరుపుతున్నట్లు వెల్లడించారు.

ABOUT THE AUTHOR

...view details