తెలంగాణ

telangana

ETV Bharat / bharat

శబరిమల: మహిళల ప్రవేశంపై ఈనెల 13 నుంచి సుప్రీం విచారణ - శబరిమల తాజా వార్తలు

శబరిమలలో మహిళల ప్రవేశానికి సంబంధించి మరోసారి సుప్రీం కోర్టు విచారణ చేపట్టనుంది. ఈ నెల 13 నుంచి 9 మంది సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం వాదనలు విననుంది.

sc-sabarimala
sc-sabarimala

By

Published : Jan 6, 2020, 7:24 PM IST

శబరిమలలో మహిళల ప్రవేశానికి సంబంధించి సుప్రీం కోర్టు విచారణ చేపట్టనుంది. ఇందుకోసం 9 మంది సభ్యులతో రాజ్యాంగ ధర్మాసనాన్ని ఏర్పాటు చేసింది. ఈ నెల 13 నుంచి వాదనలు కొనసాగుతాయని న్యాయస్థానం తెలిపింది. ఈ సమస్యతోపాటు ముస్లిం, పార్శీ మహిళలపై వివక్షపైనా ధర్మాసనం విచారిస్తుందని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది.

శబరిమల ఆలయంలోకి అన్ని వయస్కుల మహిళలకు ప్రవేశం కల్పిస్తూ 2018లో సుప్రీం కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. అనంతరం మహిళల ప్రవేశంపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ తీర్పును సమీక్షించాలని భారత యువ న్యాయవాదుల సంఘం వ్యాజ్యం దాఖలు చేసింది.

మహిళల ప్రవేశంపై నిషేధం ఒక్క శబరిమల సమస్యే కాదని సుప్రీం కోర్టు గతంలో వ్యాఖ్యానించింది. మసీదుల్లోకి ముస్లిం మహిళలకు, ఇతర వ్యక్తులను పెళ్లి చేసుకున్న పార్శీ మహిళలకు ఆలయాల్లోకి ప్రవేశం కల్పించకపోవటాన్ని న్యాయస్థానం ప్రస్తావించింది.

ఇదీ చూడండి: శబరిమల వెళ్లే మహిళలకు భద్రత కల్పనకు సుప్రీం నో

ABOUT THE AUTHOR

...view details