తెలంగాణ

telangana

ETV Bharat / bharat

అర్ణబ్​ బెయిల్​ పిటిషన్​పై నేడు సుప్రీంలో విచారణ - ఆత్మహత్య కేసులో అర్ణబ్​ గోస్వామి బెయిల్​ పిటిషన్​

రిపబ్లిక్​ టీవీ ఛానల్​ చీఫ్​ ఎడిటర్​ అర్ణబ్​ గోస్వామి ​పిటిషన్​పై సుప్రీం కోర్టు నేడు విచారణ చేపట్టనుంది. బాంబే హైకోర్టు బెయిల్​ తిరస్కరించడం వల్ల అర్ణబ్​ అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు.

SC to hear Arnab Goswami's plea against HC order refusing relief in suicide case
అర్ణబ్​ బెయిల్​ పిటిషన్​పై సుప్రీం విచారణ

By

Published : Nov 11, 2020, 6:18 AM IST

బాంబే హైకోర్టు ఉత్తర్వులను సవాల్​ చేస్తూ రిపబ్లిక్​ టీవీ ఎడిటర్​ ఇన్​ చీఫ్​ అర్ణబ్​ గోస్వామి దాఖలు చేసిన పిటిషన్​ను నేడు పరిశీలించనుంది సుప్రీం కోర్టు. 2018లో ఓ ఇంటీరియర్‌ డిజైనర్, అతని తల్లి ఆత్మహత్య కేసులో పోలీసులు అర్ణబ్​ను అరెస్టు​ చేశారు. దీనిపై అర్ణబ్​ దాఖలు చేసిన బెయిల్​ పిటిషన్​ను హైకోర్టు తిరస్కరించగా.. ఆయన అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు.

ఈ కేసులో అర్ణబ్​​‌​‌తో పాటు మరో ఇద్దరిని అలీబాగ్‌ పోలీసులు నవంబర్‌ 4న అరెస్ట్​ చేశారు.

అర్ణబ్​​‌​ తాజాగా దాఖలు చేసిన బెయిల్ పిటిషన్​లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు ముంబయి పోలీసులను ప్రతివాదులుగా చేర్చారు. ఇలా ఉంటే బాంబే హైకోర్టు సూచన మేరకు కింది న్యాయస్థానం అయిన రాయ్‌గఢ్​ సెషన్స్ కోర్టులో కూడా బెయిల్ దాఖలు చేశారు.

మహా సర్కారు అలా..

మరోవైపు మహారాష్ట్ర ప్రభుత్వం ఈ కేసుకు సంబంధించి సుప్రీంకోర్టులో కేవియట్​ పిటిషన్​ దాఖలు చేసింది. తమ వాదన వినకుండా అర్ణబ్​ బెయిల్​ అభ్యర్థనపై నిర్ణయం తీసుకోరాదని విన్నవించింది. కాగా బెయిల్​ కోసం సెషన్స్​ కోర్టులో అర్ణబ్​ వేసిన పిటిషన్​పైనా మంగళవారం విచారణ జరిగింది.

ABOUT THE AUTHOR

...view details