ఐఎన్ఎక్స్ మీడియా కేసులో దిల్లీ హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలని కేంద్ర మాజీ మంత్రి చిదంబరం దాఖలు చేసిన పిటిషన్‌పై నేడు ఆదేశాలు జారీ చేయనుంది సుప్రీంకోర్టు.
తనపై ఉన్న నాన్‌బెయిలెబుల్ వారెంట్‌ను సవాలు చేస్తూ కేంద్ర మాజీ ఆర్థికమంత్రి దాఖలు చేసిన వ్యాజ్యంపైనా సుప్రీంకోర్టు విచారణ చేపట్టే అవకాశముంది.
జస్టిస్ భానుమతి, జస్టిస్ బోపన్న కూడిన ధర్మాసనం ఈ ఈడీ కేసుకు సంబంధించిన పిటిషన్‌పై తీర్పును ఆగస్టు 29న రిజర్వులో ఉంచింది. సీల్డ్ కవర్లో ఈడీ సమర్పించిన విచారణ పత్రాలను చూడాలా వద్దా అనే అంశాన్ని పరిశీలిస్తామని స్పష్టం చేసింది అత్యున్నత న్యాయస్థానం.