నేరారోపణలు ఉన్న నేతలు ఎన్నికల్లో పోటీచేయకుండా నిషేధించాలన్న వ్యాజ్యంపై కేంద్రానికి నోటీసులు జారీ చేసింది సుప్రీంకోర్టు. ఆరు వారాల్లోగా అభిప్రాయం చెప్పాలని స్పష్టం చేసింది.
చట్టసభ సభ్యులపై ఉన్న కేసులను సాధ్యమైనంత త్వరగా పరిష్కరించాలని భాజపా నేత, న్యాయవాది అశ్విని ఉపాధ్యాయ్ దాఖలు చేసిన పిటిషన్ను విచారించింది జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని ధర్మాసనం. ఈ సందర్భంగా... పెండింగ్లో ఉన్న కేసుల విచారణ తమ ప్రాధాన్యమని జస్టిస్ ఎన్వీ రమణ స్పష్టం చేశారు.
రాష్ట్రాల వారీగా ఎంపీలు, ఎమ్మెల్యేలపై ఉన్న నేరారోపణ కేసుల జాబితా నివేదికను ఇప్పటికే సుప్రీంకోర్టుకు సమర్పించింది అమికస్ క్యూరీ. దానిని పరిశీలిస్తామని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.
న్యాయవాది అశ్విని ఉపాధ్యాయ్ దేశవ్యాప్తంగా మాజీ, ప్రస్తుత చట్టసభ సభ్యులపై నాలుగు వేలకు పైగా క్రిమినల్ కేసులు పెండింగ్లో ఉన్నాయని ఈ నివేదిక పేర్కొంది. ఇందులో సగానికిపైగా సిట్టింగ్ ఎంపీలు, ఎమ్మెల్యేలు ఉండటం గమనార్హం.
ఇదీ చూడండి:-'ఆ సమస్యకు పరిష్కారం సీబీఎస్ఈ చేతిలో లేదు'