తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ముమ్మారు తలాక్​పై కేంద్రానికి సుప్రీం నోటీసులు​

ముమ్మారు తలాక్​ చట్టానికి వ్యతిరేకంగా సుప్రీం కోర్టులో తాజాగా మరో పిటిషన్​ దాఖలైంది. తలాక్​ చెప్పి విడాకులు ఇవ్వడాన్ని శిక్షార్హమైన నేరంగా పరిగణించే నిబంధన చెల్లుతుందో లేదో పరిశీలించేందుకు కోర్టు అంగీకరించింది. కేంద్రాన్ని వివరణ కోరుతూ నోటీసులు జారీ చేసింది. గతంలో దాఖలైన పిటిషన్లతో పాటు విచారణ చేపడతామని స్పష్టం చేసింది.

ముమ్మార్​ తలాక్​

By

Published : Sep 13, 2019, 8:45 PM IST

Updated : Sep 30, 2019, 12:24 PM IST

మహిళల రక్షణ కోసం.. కేంద్రం తీసుకొచ్చిన ముమ్మారు తలాక్​ చట్టానికి వ్యతిరేకంగా సుప్రీం కోర్టులో మరో పిటిషన్​ దాఖలైంది. ముస్లిం మహిళలకు తలాక్​ చెబితే.. గరిష్ఠంగా మూడేళ్ల జైలు శిక్షను విధించే నిబంధన చెల్లుబాటును పరిశీలించేందుకు కోర్టు అంగీకరించింది.

సుప్రీం న్యాయమూర్తి జస్టిస్​ ఎన్​వీ రమణ, జస్టిస్​ ఇందిరా బెనర్జీ, జస్టిస్​ అజయ్​ రాస్తోగిలతో కూడిన త్రిసభ్య ధర్మాసనం.. ఓ సంస్థ దాఖలు చేసన పిటిషన్​ను పరిశీలించింది. ఈ వాజ్యంపై కేంద్రాన్ని వివరణ కోరుతూ నోటీసులు జారీ చేసింది. తలాక్​ చట్టంపై గతంలో దాఖలైన పిటిషన్లతో పాటు ఈ వ్యాజ్యంపై విచారణ చేపడతామని పేర్కొంది.

కేంద్రం రాజ్యాంగ నిబంధనల్ని ఉల్లంఘించి ముస్లిం మహిళల( వివాహ హక్కుల పరిరక్షణ) చట్టాన్ని రూపొందించిందని సుప్రీం కోర్టులో ఇప్పటికే మూడు పిటిషన్లు దాఖలయ్యాయి.

ఇదీ చూడండి: చెన్నైలో సాఫ్ట్​వేర్​ ఇంజినీర్​ను బలిగొన్న పెళ్లి ఫ్లెక్సీ

Last Updated : Sep 30, 2019, 12:24 PM IST

ABOUT THE AUTHOR

...view details