తెలంగాణ

telangana

ETV Bharat / bharat

స్పీకర్​ నిర్ణయంతో 'బలపరీక్ష'పై అనుమానాలు..!

కన్నడ రాజకీయ సంక్షోభం.. మలుపులు తిరుగుతూనే ఉంది. ఈ రోజు బలపరీక్ష జరుగుతుందనుకుంటున్న తరుణంలో అనూహ్య పరిణామాలు జరుగుతున్నాయి. స్వతంత్ర ఎమ్మెల్యేల పిటిషన్లకు సుప్రీంలో చుక్కెదురైంది. మరోవైపు.. రెబల్స్​కు నోటీసులు పంపారు సభాపతి.

కర్ణాటకీయం: రెబల్స్​కు స్పీకర్​ నోటీసులు

By

Published : Jul 22, 2019, 11:46 AM IST

Updated : Jul 22, 2019, 1:01 PM IST

కర్ణాటక అసెంబ్లీలో కీలక పరిణామాలు

కన్నడ అసెంబ్లీలో నేడు బలపరీక్ష.. జరిగే అవకాశాలపై అనిశ్చితి నెలకొంది. రెండు రోజుల అనంతరం... ప్రారంభమైన అసెంబ్లీలో ముఖ్యమంత్రి బలనిరూపణ జరుగుతుందని అంతా అనుకున్న తరుణంలో స్పీకర్​ కీలక నిర్ణయం తీసుకున్నారు.

రాజీనామాలు చేసిన రెబల్స్​ ఎమ్మెల్యేలకు నోటీసులు పంపించారు సభాపతి రమేశ్​ కుమార్​. మంగళవారం ఉదయం 11 గంటలకు తన కార్యాలయంలో కలవాల్సిందిగా ఆదేశించారు. సంకీర్ణ కూటమి నేతల ఫిర్యాదు మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారు స్పీకర్​.

సుప్రీంలో చుక్కెదురు...

మరోవైపు.. సుప్రీంకోర్టును ఆశ్రయించిన స్వతంత్ర ఎమ్మెల్యేలిద్దరికీ చుక్కెదురైంది. కన్నడ అసెంబ్లీలో ఇవాళే.. ముఖ్యమంత్రి బలనిరూపణ చేసుకునేలా ఆదేశించాలని అత్యున్నత న్యాయస్థానంలో పిటిషన్​ దాఖలు చేశారు స్వతంత్ర శాసనసభ్యులు శంకర్​, నగేశ్​. తమ పిటిషన్లపై త్వరగా విచారణ చేపట్టాలన్న విజ్ఞప్తిని తోసిపుచ్చారు ప్రధాన న్యాయమూర్తి రంజన్​ గొగొయి. రేపు విచారణ జరుపుతామని స్పష్టం చేశారు.

బలనిరూపణపై అనుమానాలు...

ఇప్పటికే.. విప్​పై స్పష్టత అంశంలో సుప్రీంకోర్టులో వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి, రాష్ట్ర కాంగ్రెస్​ అధ్యక్షుడు దినేశ్​ గుండూరావు. వీటన్నింటిపై అత్యున్నత న్యాయస్థానం.. రేపే విచారణ చేపట్టే అవకాశముంది. ఈ పరిణామాల నేపథ్యంలో నేడు బలపరీక్ష జరగదనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సంకీర్ణ కూటమి కూడా విశ్వాస పరీక్షపై చర్చను సాగదీసే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.

Last Updated : Jul 22, 2019, 1:01 PM IST

ABOUT THE AUTHOR

...view details