పౌరసత్య చట్టం రాజ్యాంగ ప్రామాణికతను పరిశీలించేందుకు అంగీకరించింది సుప్రీం కోర్టు. కానీ.. ఈ చట్టం అమలుపై స్టే విధించేందుకు నిరాకరించింది.
'పౌర' చట్టం రాజ్యాంగబద్ధత పరిశీలనకు సుప్రీం ఓకే - latest news on citizenship-amendment-act
11:26 December 18
పౌర చట్టంపై దాఖలైన వ్యాజ్యాలపై భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్ఏ బోబ్డే, జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ సూర్య కాంత్లతో కూడిన త్రిసభ్య ధర్మాసనం విచారణ చేపట్టింది. పిటిషన్లపై వివరణ ఇవ్వాలని కేంద్రానికి నోటీసులు జారీ చేసింది. వచ్చే ఏడాది జనవరి రెండో వారంలోపు కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. తదుపరి విచారణను జనవరి 22కు వాయిదా వేసింది.
పాకిస్థాన్, బంగ్లాదేశ్, అఫ్గానిస్థాన్ నుంచి వచ్చే శరణార్థులకు భారత పౌరసత్వం కల్పించేందుకు ఈ పౌరసత్వ చట్టం వీలుకల్పిస్తోంది. అయితే.. దీనిని వ్యతిరేకిస్తూ ఐయూఎంఎల్, కాంగ్రెస్ నేత జైరాం రమేశ్, ఇతరులు దేశ అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు.