తెలంగాణ

telangana

ETV Bharat / bharat

టిక్​టాక్​ నిషేధంపై 'స్టే'కు సుప్రీం నిరాకరణ

టిక్​టాక్​ యాప్​ నిషేధంపై 'స్టే'కు సుప్రీం కోర్టు నిరాకరించింది. మద్రాస్​ హైకోర్టు ఆదేశాలను వాయిదా వేయాలన్న వాదనను తోసిపుచ్చింది. తదుపరి విచారణ ఈ నెల 22న చేపట్టనున్నట్లు తెలిపింది.

By

Published : Apr 15, 2019, 8:46 PM IST

Updated : Apr 15, 2019, 11:38 PM IST

టిక్​టాక్​ నిషేధంపై స్టేకు సుప్రీం నిరాకరణ

టిక్​టాక్​ నిషేధంపై 'స్టే'కు సుప్రీం నిరాకరణ

వీడియో షేరింగ్​ మొబైల్​ యాప్​ టిక్​టాక్​ను నిషేధించాలన్న మద్రాస్​ హైకోర్టు ఆదేశాలపై స్టే ఇచ్చేందుకు సుప్రీం కోర్టు నిరాకరించింది. నిషేధం హైకోర్టు మధ్యంతర ఆదేశం మాత్రమేనని, ఈ విషయంపై విచారణ పూర్తవలేదని అత్యున్నత న్యాయస్థానం పేర్కొంది.

సుప్రీం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్​ రంజన్​ గొగొయి, జస్టిస్​ దీపక్​ గుప్తా, జస్టిస్​ సంజీవ్​ ఖన్నాలతో కూడిన త్రిసభ్య ధర్మాసనం టిక్​టాక్​ నిషేధంపై స్టే విధించాలన్న పిటిషన్​ను స్వీకరించింది సుప్రీం. దీనిపై మరింత విచారణ అవసరమని అభిప్రాయ పడింది. ఈ నెల 22న తదుపరి విచారణ చేపట్టనున్నట్టు తెలిపింది సర్వోన్నత న్యాయస్థానం.

టిక్​టాక్​ యాప్​న​కు 100కోట్లకు పైగా డౌన్​లోడ్లు ఉన్నాయని చైనా సంస్థ బైట్​డాన్స్​​ తరఫున కోర్టుకు హాజరైన న్యాయవాది అభిషేక్​ మను సింఘ్వీ తెలిపారు. నోటీసులు సైతం ఇవ్వలేదని, ఎలాంటి వాదనలు వినకుండానే ఆదేశాలు జారీ చేసిందని పేర్కొన్నారు.

'టిక్​టాక్​'ను నిషేధించాలని ఈ నెల 3న కేంద్రాన్ని ఆదేశించింది మద్రాసు హైకోర్టు. ఈ యాప్​ సమాజంపై దుష్ప్రభావాన్ని చూపుతోందని అభిప్రాయపడింది. టిక్​టాక్​ యాప్​తో రూపొందించిన వీడియోలను ప్రసారం చేయరాదని మీడియా సంస్థలనూ ఆదేశించింది. తదుపరి విచారణను హైకోర్టు.. ఏప్రిల్​ 16కు వాయిదా వేసింది.

Last Updated : Apr 15, 2019, 11:38 PM IST

ABOUT THE AUTHOR

...view details