తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'రామ్​ కీ జన్మభూమి' వాయిదాకు సుప్రీం నిరాకరణ

'రామ్​ కీ జన్మభూమి' సినిమా విడుదలను వాయిదా వేయాలని దాఖలైన పిటిషన్​ను తిరస్కరించింది సుప్రీం కోర్టు.  సినిమా అయోధ్య కేసు మధ్యవర్తిత్వంపై ప్రభావం చూపుతుందన్న పిటిషనర్ల వాదనను తోసిపుచ్చింది. చిత్రం విడుదలకు మధ్యవర్తిత్వానికి ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేసింది. ఈ నెల 29న ప్రేక్షకుల ముందుకు రానుంది ఈ చిత్రం.

'రామ్​ కీ జన్మభూమి' వాయిదాకు సుప్రీం నిరాకరణ

By

Published : Mar 28, 2019, 12:49 PM IST

Updated : Mar 28, 2019, 12:54 PM IST

'రామ్​ కీ జన్మభూమి' సినిమాకు, అయోధ్య భూవివాదం కేసు మధ్యవర్తిత్వానికి ఎలాంటి సంబంధం లేదని తేల్చిచెప్పింది సుప్రీం కోర్టు. సినిమా విడుదలను వాయిదా వేయాలని దాఖలైన పిటిషన్​పై విచారణకు తిరస్కరించింది. విడుదలను వాయిదా వేయలేమని తేల్చిచెప్పింది. సినిమా విడుదలైతే అయోధ్య భూవివాదం కేసు మధ్యవర్తిత్వాన్ని బలహీన పరుస్తుందన్న పిటిషనర్​ వాదనలను తోసిపుచ్చింది.

జస్టిస్​ ఎస్.ఎ.బోబ్డే నేతృత్వంలోని సుప్రీం ధర్మాసనం పిటిషన్​పై విచారించింది.

ఈ నెల 29న దేశవ్యాప్తంగా విడుదల కానుంది రామ్​ కీ జన్మభూమి చిత్రం. సనోజ్​ మిశ్రా ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. రామ​ మందిరం చుట్టూ తిరిగే వివాదాస్పద విషయాలను తెరకెక్కించినట్లు తెలుస్తోంది.

రామ్​ కీ జన్మభూమి సినిమాపై దాఖలైన మరో పిటిషన్​పై బుధవారం వాదనలు విన్న దిల్లీ హైకోర్టు రాజ్యాంగం కల్పించిన భావవ్యక్తీకరణ స్వేచ్ఛ హక్కుకు భంగం వాటిల్లకూడదంటే ప్రజలు సహనంతో ఉండాలని అభిప్రాయపడింది.

ఇదీ చూడండీ:భారత్​ 'మిషన్​ శక్తి'పై అగ్రరాజ్యం మిశ్రమ స్పందన

Last Updated : Mar 28, 2019, 12:54 PM IST

ABOUT THE AUTHOR

...view details