తెలంగాణ

telangana

ETV Bharat / bharat

మోదీ, షా కోడ్​ కేస్​: సుష్మిత పిటిషన్​ తిరస్కరణ - మోదీ

ఎన్నికల నిబంధనావళి ఉల్లంఘన వ్యవహారంలో నరేంద్ర మోదీ, అమిత్‌షాపై కాంగ్రెస్ ఎంపీ సుష్మితా దేవ్​ దాఖలు చేసిన వ్యాజ్యంపై విచారణకు సుప్రీంకోర్టు నిరాకరించింది. ఈసీ ఆదేశాలను సవాలు చేస్తూ మరో వ్యాజ్యం దాఖలు చేసేందుకు అవకాశం ఇచ్చింది.

సుప్రీంలో సుష్మితా వ్యాజ్యం కొట్టివేత

By

Published : May 8, 2019, 12:51 PM IST

ప్రధాని నరేంద్ర మోదీ, భాజపా అధ్యక్షుడు అమిత్​షాకు వ్యతిరేకంగా కాంగ్రెస్ దాఖలు చేసిన మరో పిటిషన్​పై విచారణకు సుప్రీంకోర్టు నిరాకరించింది. ఎన్నికల నిబంధనావళి ఉల్లంఘించిన మోదీ, షాపై చర్యలు తీసుకోవాలని కోరుతూ వేసిన వ్యాజ్యాన్ని తోసిపుచ్చింది.

మోదీ, షా ఎన్నికల నియమావళిని ఉల్లఘించినా... ఈసీ క్లీన్​చిట్​ ఇవ్వటాన్ని సవాల్​ చేస్తూ వ్యాజ్యాన్ని దాఖలు చేశారు కాంగ్రెస్ ఎంపీ సుష్మితా సేన్.

సుష్మితా వ్యాజ్యాన్ని పరిశీలించిన భారత ప్రధాన న్యాయమూర్తి రంజన్​ గొగొయి నేతృత్వంలోని ధర్మాసనం... మరోసారి ఈసీ నిర్ణయానికి వ్యతిరేకంగా పిటిషన్​ వేసే స్వేచ్ఛ ఉందని వ్యాఖ్యానించింది. భాజపా నేతలకు సచ్ఛీలత పత్రాన్ని ఇచ్చిన ఈసీ ఆదేశాలను అందులో పేర్కొనాలని సూచించింది.

మోదీ, షాపై ఎన్నికల సంఘానికి 11 ఫిర్యాదులు అందితే కేవలం 5 ఫిర్యాదులపైనే ఈసీ నిర్ణయం తీసుకుందని సుస్మితా దేవ్‌ ఈ పిటిషన్‌ వేశారు. ఎలాంటి కారణాలు చూపించకుండా మోదీకి క్లీన్‌చిట్ ఇచ్చారని అందులో పేర్కొన్నారు. మిగిలిన 6 ఫిర్యాదులు సహా మాజీ ప్రధాని రాజీవ్‌ గాంధీపై మోదీ చేసిన అనుచిత వ్యాఖ్యలపైనా ఈసీ చర్యలు తీసుకోలేదని ప్రస్తావించారు.

ఇదీ చూడండి:మోదీ, షాపై సుప్రీంలో కాంగ్రెస్ మరో వ్యాజ్యం

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details