తెలంగాణ

telangana

ETV Bharat / bharat

సీఏఏ రాజ్యాంగబద్ధతపై ప్రకటన చేయలేం: సుప్రీం - పౌరసత్వ సవరణ బిల్లు

పౌర చట్టాన్ని రాజ్యాంగబద్ధమని ప్రకటించాలని కోరుతూ వేసిన పిటిషన్​పై సుప్రీంకోర్టు ఆశ్చర్యం వ్యక్తం చేసింది. అత్యవసర విచారణకు నిరాకరించింది. చట్టం చెల్లుబాటును పరిశీలించటమే న్యాయస్థానాల విధి అని పేర్కొంది.

SC-CAA
SC-CAA

By

Published : Jan 9, 2020, 12:39 PM IST

పౌరసత్వ సవరణ చట్టాన్ని రాజ్యాంగబద్ధమని ప్రకటించాలని కోరుతూ వేసిన పిటిషన్​ అత్యవసర విచారణకు సుప్రీం కోర్టు తిరస్కరించింది. వ్యాజ్యాన్ని పరిశీలించిన సీజేఐ జస్టిస్​ ఎస్​ఏ బాబ్దే నేతృత్వంలోని ధర్మాసనం ఆశ్చర్యం వ్యక్తం చేసింది.

"చట్టం రాజ్యాంగపరంగా చెల్లుబాటు అవుతుందా లేదా అని విచారించటమే న్యాయస్థానం విధి. అది రాజ్యాంగబద్ధమా కాదా అన్న విషయాన్ని కోర్టు ప్రకటించలేదు. ఇలా కోర్టును అభ్యర్థించటం మొదటిసారి."

-సుప్రీం ధర్మాసనం

సీఏఏ రాజ్యాంగబద్ధమని ప్రకటిస్తూ అన్ని రాష్ట్రాలు అమలు చేసేలా ఆదేశాలు ఇవ్వాలని న్యాయవాది వినీత్ ధండా వ్యాజ్యం దాఖలు చేశారు. అంతేకాకుండా సీఏఏకు వ్యతిరేకంగా వదంతులు వ్యాప్తి చేస్తున్న కార్యకర్తలు, విద్యార్థులు, వార్తా సంస్థలపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.

అల్లర్లు తగ్గిన తర్వాతే పౌర చట్టం చెల్లుబాటుపై దాఖలైన వ్యాజ్యాలను పరిశీలిస్తామని కోర్టు స్పష్టం చేసింది.

ABOUT THE AUTHOR

...view details