తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'కశ్మీర్​పై సుప్రీం తీర్పుతో మోదీ ప్రభుత్వానికి ఎదురు దెబ్బ'

కశ్మీర్​పై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును కాంగ్రెస్​ స్వాగతించింది. మోదీ ప్రభుత్వానికి ఇదొక ఎదురుదెబ్బగా అభివర్ణించింది. కశ్మీర్​వాసుల బాధను కోర్టు అర్థం చేసుకున్నందుకు ధన్యవాదాలు తెలిపారు కాంగ్రెస్​ సీనియర్​ నేత గులాం నబీ ఆజాద్​.

SC order on Kashmir a big jolt to Modi govt: Congress
'కశ్మీర్​పై సుప్రీం తీర్పుతో మోదీ ప్రభుత్వానికి ఎదురు దెబ్బ'

By

Published : Jan 10, 2020, 2:52 PM IST

Updated : Jan 10, 2020, 7:28 PM IST

'కశ్మీర్​పై సుప్రీం తీర్పుతో మోదీ ప్రభుత్వానికి ఎదురు దెబ్బ'

అంతర్జాలం ప్రతి ఒక్కరి ప్రాథమిక హక్కు అన్న సుప్రీంకోర్టు తీర్పుతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వానికి ఎదురు దెబ్బ తగిలిందని కాంగ్రెస్​ పేర్కొంది. ప్రజా వ్యతిరేకతను ఆంక్షల ద్వారా అణచివేయలేరని కోర్టు స్పష్టం చేయడంపై హర్షం వ్యక్తం చేసింది.

"ఇంటర్నెట్​ ప్రాథమిక హక్కని సుప్రీం కోర్టు వ్యాఖ్యానించడం మోదీ ప్రభుత్వానికి పెద్ద ఎదురు దెబ్బ. 144 సెక్షన్​ విధించి నిరసనలను అణచివేయద్దని పేర్కొన్న న్యాయస్థానం.. మోదీ షాలకు రెండో షాక్​ ఇచ్చింది. దేశం రాజ్యాంగం ముందు తలవంచుతుంది కానీ మోదీ ముందు కాదు."

-రణదీప్​ సూర్జేవాలా, కాంగ్రెస్​ అధికార ప్రతినిధి

జమ్ముకశ్మీర్​లో ఆంక్షలను వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్లపై శుక్రవారం సుప్రీం కోర్టు కీలక తీర్పును వెలువరించింది. నిర్బంధ ఉత్తర్వుల్ని సమీక్షించాలని జమ్మూ పాలనావ్యవస్థకు ఆదేశాలు జారీ చేసింది. వారంలోగా ఈ ప్రక్రియ పూర్తవ్వాలని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్​ స్పందించింది.

జమ్ముకశ్మీర్​పై సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును కాంగ్రెస్​ సీనియర్​ నేత గులాం నబీ ఆజాద్​ హర్షం వ్యక్తం చేశారు. ప్రభుత్వం ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేసిందని, కానీ ఈసారి న్యాయస్థానం ఎలాంటి ఒత్తిడికి లోనుకాలేదని అభిప్రాయపడ్డారు.

మేము తీర్పును స్వాగతిస్తున్నాము. జమ్ముకశ్మీర్​ ప్రజలు అనుభవిస్తున్న పరిస్థితులపై సుప్రీం తొలి సారి ప్రస్తావించింది. అత్యున్నత న్యాయస్థానం తీసుకున్న చారిత్రక నిర్ణయానికి ధన్యవాదాలు. దేశంలోని ప్రతి ఒక్కరూ దీనికోసమే ఎదురు చూస్తున్నారు.

-గులాం నబీ ఆజాద్​, కాంగ్రెస్​ సీనియర్​ నేత.

ఈ వార్త వినగానే సంతోషం వేసింది.

మరోవైపు సుప్రీం తీర్పుపై కశ్మీర్​ ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఐదు నెలలకు పైగా ఇంటర్నెట్​ సేవలు నిలిపేయడం వల్ల చాలా ఇబ్బంది పడినట్లు తెలిపారు. త్వరలోనే సేవలు తిరిగి ప్రారంభం కావాలని ఆశించారు.

ఇదీ చూడండి:'ముసుగు వ్యక్తుల సమాచారముంటే మాకివ్వండి'

Last Updated : Jan 10, 2020, 7:28 PM IST

ABOUT THE AUTHOR

...view details