తెలంగాణ

telangana

ETV Bharat / bharat

కేంద్రం, ఈసీకి 'కోర్టు ధిక్కరణ' నోటీసులు

కేంద్రప్రభుత్వం, ఈసీకి సుప్రీంకోర్టు.. తీర్పు ఉల్లంఘన నోటీసులు జారీ చేసింది. అభ్యర్థుల నేరచరిత్ర విషయంలో ఇరువురిపై కోర్టు ధిక్కరణ చర్యలు ఎందుకు తీసుకోకూడదని ప్రశ్నించింది.

By

Published : Mar 29, 2019, 4:04 PM IST

Updated : Mar 29, 2019, 7:18 PM IST

కేంద్రం,ఈసీకి 'కోర్టు ధిక్కరణ' నోటీసులు

కేంద్రం,ఈసీకి 'కోర్టు ధిక్కరణ' నోటీసులు
సార్వత్రిక ఎన్నికల ముందు కేంద్రప్రభుత్వం, ఎన్నికల సంఘానికి(ఈసీ) సుప్రీంకోర్టు నోటీసులు జారీచేసింది. ఎన్నికల్లో అభ్యర్థుల నేరచరిత్రను సేకరించకపోవటంపై వివరణ కోరింది. కోర్టు ధిక్కరణ చర్యలు ఎందుకు తీసుకోకూడదని ప్రశ్నించింది. ఈ అంశంపై వివరణ ఇవ్వాల్సిందిగా అధికారులను ఆదేశించింది అత్యున్నత న్యాయస్థానం.

కేంద్రం, ఈసీలు అభ్యర్థుల నేరచరిత్ర సేకరించకుండా కోర్టు ధిక్కరణకు పాల్పడ్డారని న్యాయవాది అశ్విని కుమార్​ ఉపాధ్యాయ్​ సుప్రీంలో వ్యాజ్యం దాఖలు చేశారు. శుక్రవారం ఈ కేసుపై వాదనలు విన్న ధర్మాసనం... ఈసీతో పాటు కేంద్రానికి తాఖీదులు జారీ చేసింది.

" దేశంలోని ప్రముఖ వార్తాపత్రికలు, టీవీ ఛానళ్లు ఏమిటో అభ్యర్థులకు ఈసీ తెలపలేదు. నిర్ణీత సమయాల్లోనే అభ్యర్థులు వారి నేరచరిత్రను పత్రికల్లో ప్రచురించాలని నిబంధనలు కూడా విధించలేదు. అందువల్ల టీవీలను ఎక్కవమంది చూడని సమయాల్లో రాజకీయ నేతలు వారి నేరచరిత్రను ప్రసారం చేశారు. రాజకీయ పార్టీలు వారి అభ్యర్థుల నేర చరిత్ర వివరాలను వెబ్​సైట్​లో గానీ, వార్తా పత్రికలో గానీ ప్రచురించలేదు. టీవీ ఛానెళ్లలోనూ ప్రసారం చేయలేదు. ఇలాంటి రాజకీయ పార్టీలు, అభ్యర్థులపై ఈసీ ఎలాంటి చర్యలు తీసుకోలేదు. అభ్యర్థులు నేర చరిత్ర వివరాలు ప్రకటించకుండానే ఈసీ సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్​ను విడుదల చేసి, 2018 సెప్టెంబర్​ 25 నాటి కోర్టు తీర్పును ధిక్కరించింది. "
- అశ్విని కుమార్​ ఉపాధ్యాయ్, న్యాయవాది

ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థులు వారి నేర చరిత్రను ఈసీకి తెలపాల్సిందిగా గతేడాది సెప్టెంబర్​ 25న సుప్రీం తీర్పునిచ్చింది. ప్రముఖ వార్తాపత్రికలు, టీవీలు, పార్టీ వెబ్​సైట్లలో వివరాలను వెల్లడించాలని ఆదేశించింది.

Last Updated : Mar 29, 2019, 7:18 PM IST

ABOUT THE AUTHOR

...view details